Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ కి టాలీవుడ్ స్టార్లు నాని, సమంత పెళ్లి విషెష్..

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ కి టాలీవుడ్ స్టార్లు నాని, సమంత పెళ్లి విషెష్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ వివాహం ఘనంగా జరిగింది. కీర్తి సురేష్ తన కాలేజ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిళ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా గురువారం వీరి వివహం గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో జరిగింది. దీంతో కీర్తి సురేష్ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఈ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. అయితే కీర్తి సురేష్ తన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా విషెష్ చెబుతున్నారు. 

ఈ క్రమంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా కీర్తిసురేష్ కి విషెష్ తెలియజేశాడు.  ఇందులోభాగంగా కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలని షేర్ చేశాడు. ఈ ఫొటోలో కీర్తి సురేష్ చాలా సంతోషంగా కనిపిస్తోంది. దీంతో "నేను చాలా అద్భుత క్షణాన్ని చూశాను. ఈ అమ్మాయి, ఈ ఎమోషన్, డ్రీమ్ అంటూ లవ్ ఎమోజీ సింబల్స్ షేర్ చేశాడు. అయితే కీర్తి సురేష్ నాని కలసి నేను లోకల్, దసరా తదితర సినిమాలలో నటించారు. దీంతో కీర్తి సురేష్ కి నాని కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా కీర్తి సురేష్ కి విషెష్ తెలిపింది. ఈ క్రమంలో నవదంపతులకి కంగ్రాచ్యులేషన్స్, మీరు కలకాలం హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిళ్‌ పెళ్లి ఫోటోని జోడిస్తూ స్టోరీ షేర్ చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండటంతో షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త సినిమా ఆఫర్లని యాక్సెప్ట్ చెయ్యడం లేదని సమాచారం.

ALSO READ | SYG - Carnage: సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు.. కార్నేజ్ వీడియోతో గూస్ బంప్స్