Tira Grazia Fashion Awards 2025: గ్రాజియా అవార్డ్స్ 2025 వేడుకల్లో మెరిసిన సినీ సెలబ్రిటీలు..

Tira Grazia Fashion Awards 2025: గ్రాజియా అవార్డ్స్ 2025 వేడుకల్లో మెరిసిన సినీ సెలబ్రిటీలు..

ప్రముఖ మ్యాగిజైన్ సంస్థ గ్రాజియా అవార్డ్స్ సెలెబ్రేషన్స్ ఏటా నిర్వహించే బుధవారం(మార్చ్19) ముంబైలో గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ వేడుకలకి బాలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే సెలెబ్రేషన్స్ ఈవెంట్ కి అనుషా దండేకర్ హోస్ట్‌గా వ్యవహరించి యాంకరింగ్ తో అలరించింది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియా, ఆనిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి, ఉర్ఫీ జావేద్, మలైకా అరోరా తదితరులు పాల్గొని అలరించారు. తమన్నా భాటియా ఆజ్ కి రాత్ సాంగ్ కి స్టేజీ మీద స్టెప్పులు వేయగా, మలైకా అరోరా ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకుంది. ఇతర హీరోయిన్లు బ్యూటీ చిట్కాలు కూడా ఇచ్చారు. అనంతరం ఫ్యాషన్ అవార్డ్స్ పోటీలో విన్నర్స్ కి షీల్డ్ బహుకరించారు.