బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్.. కేసు పెడాతారా..?

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్.. కేసు పెడాతారా..?

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినందుకు సినీ పరిశ్రమకి చెందిన 11మంది సెలెబ్రెటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.. దీంతో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారు భయంతో వణికి పోతునారని చెప్పవచ్చు.. 

అయితే ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేసింది చిన్నాచితకా ఆర్టిస్టులపై కానీ అసలు సిసలైన కథ ఇప్పుడే ఆరంభమైంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో టాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలకి చెందిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు..  టాలీవుడ్ లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా గతంలో A23 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశాడు. ఈ వీడియోలలో ఎవరు విన్ అవుతారో కరెక్ట్ గా గెస్ చేసి డబ్బు సంపాదించండి అంటూ డైలాగులు చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో యాడ్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ యాప్ ని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందాన తదితరులతోపాటూ మరింతమంది సెలెబ్రెటీలు ప్రమోట్ చేశారు.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా జీత్ విన్ అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం సృష్టించడంతో నిధి అగర్వాల్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే జీత్ విన్ లో రిజిస్టర్ చేసుకుని వెంటనే గేమ్స్ ఆడండి అని తెలిపింది. అలాగే ఇందులో రిజిస్టర్ చేసుకుని బెట్ వేస్తే మొదటిసారి 50% అదనపు బోనస్ కూడా వస్తుందని ప్రమోట్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై కేసులో నమోదు చేసినట్లుగానే బెట్టింగ్ యాప్స్ ని ప్ర్మవుట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్స్ పై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని పోలీసులను కోరుతున్నారు..

వీళ్ళే కాదు కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా తదితర స్టార్ హీరోయిన్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు.. అయితే ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాపైఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణకి రావాలని ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ | ఎంక్వైరీకి రావాలమ్మా.. విష్ణుప్రియకు పిలుపొచ్చింది.. అరెస్ట్ చేస్తారా..?