ఐదోసారి కప్ గెలుస్తాం

ఐదోసారి కప్ గెలుస్తాం

నటనతో కాదు ఆటతోనూ ప్రేక్షకులను అలరిస్తామంటున్నారు  సినిమా స్టార్స్. 10 సీజన్లు సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కొనసాగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సరికొత్త  సీజన్‌‌‌‌తో రాబోతోంది.  ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్‌‌‌‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో టాలీవుడ్‌‌‌‌కు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ తమ జెర్సీని లాంచ్ చేశారు. ఇందులో టీమ్ కెప్టెన్ అఖిల్‌‌‌‌తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెప్టెన్ అఖిల్ మాట్లాడుతూ ‘ఇప్పటికే మేం  నాలుగు సార్లు టైటిల్ గెలిచాం. ఈసారి కూడా టైటిల్ కొట్టి ఐదు సార్లు ఛాంపియన్‌‌‌‌గా నిలుస్తామనే నమ్మకం ఉంది. అన్నింటికంటే అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేయాలనే  ప్యాషన్‌‌‌‌తో వస్తున్నాం. ఈనెల 14, 15న  ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అని అన్నాడు.

 క్రికెట్ తమకు చాలా ఎనర్జీ ఇస్తుందని, తమది చాలా క్రేజీ టీమ్ అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు. తెలుగు వారియర్స్ టీమ్ ఎల్లప్పుడూ టోర్నమెంట్‌‌‌‌కు అదనపు ఉత్సాహాన్ని ఇస్తుందని టీమ్ ఓనర్ సచిన్ జోషి, సీసీఎల్ ఫౌండర్  విష్ణు వర్ధన్ ఇందూరి చెప్పారు. ఫిబ్రవరి 8న బెంగళూరులో కర్ణాటక బుల్డోజర్స్‌‌‌‌తో తలపడనుండగా, ఫిబ్రవరి 14న ఉప్పల్‌‌‌‌లో భోజ్‌‌‌‌పురి దబ్బాంగ్స్‌‌‌‌తో,  ఫిబ్రవరి 15న  చెన్నై  రైనోస్‌‌‌‌తో,  ఫిబ్రవరి 23న సూరత్‌‌‌‌లో బెంగాల్ టైగర్స్‌‌‌‌తో తెలుగు వారియర్స్ పోటీ పడనున్నారు.