డిసెంబర్ 26న సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు. FDC చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు.టాలీవుడ్ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు.. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు.
సినిమా పరిశ్రమ సమస్యలు, తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు బుధవారం (డిసెంబర్ 25) పరామర్శించారు . ఈ సందర్బంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు దిల్ రాజ్ చెప్పారు. ప్రభుత్వానికి ,సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటానని చెప్పారు.