Renu Desai: రేణు దేశాయ్ ఇంట్లో విషాదం... ఏం జరగిందంటే..?

Renu Desai: రేణు దేశాయ్ ఇంట్లో విషాదం... ఏం జరగిందంటే..?

Renu Desai: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్, డిప్యూటి సీఎం మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. కాగా రేణు దేశాయ్ తల్లి గురువారం మధ్యాహ్నం కన్ను మూసింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపింది. దీంతో అభిమానులు, సన్నిహితులు రేణు దేశాయ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే రేణు దేశాయ్ తల్లి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

ఆది శంకరాచార్యులు వారు చెప్పిన మళ్లీమళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ చనిపోతుంటారు. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించక తప్పదంటూ చెప్పిన వాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి రేణు దేశాయ్ 2000వ సవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ పూరీ జగ న్నాథ్ డైరెక్ట్ చేసిన బద్రి అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత జానీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి  పేలి చేసుకుంది. కానీ పెళ్ళయిన కొంతకాలానికే పరస్పర అంగీకారంతో విడిపోయారు. 

ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలైన అకీరా నందన్, ఆద్య దేశాయ్ సంరక్షణ చూసుకుంటోంది. ఇక 20 ఏళ్ల తర్వాత ప్రముఖ హీరో రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.