సొంతింటి కల నెరవేర్చుకున్న యంగ్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) తన సొంతింటి కల నెరవేర్చుకున్నారు. సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటీ, పెద్దకల్వపల్లెలో కిరణ్ తన కలల ఇంటిని అన్ని హంగులతో, అందంగా, ఆకర్షణీయమైన ఫర్నీచర్‌తో నిర్మించుకున్నారు. తన సొంతింటి కల నెరవేరడంతో చాలా ఆనందంగా ఉన్న కిరణ్ అబ్బవరం.. ఈ ఆనందాన్ని తన అభిమానులంతో పంచుకున్నారు. గృహ ప్రవేశానికి సంబందించిన, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడిపిన ఆనంద క్షణాలను కలిపి ఒక వీడియో గా చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ యంగ్ హీరోకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ALSO READ : ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రూల్స్ రంజన్(Rules ranjan) అనే సినిమా చేస్తున్నారు. రత్నం కృష్ణ(Rathnam krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.