Paris Olympics 2024: హాలీవుడ్ హీరో అద్భుత విన్యాసంతో ముగిసిన పారిస్ ఒలింపిక్స్

Paris Olympics 2024: హాలీవుడ్ హీరో అద్భుత విన్యాసంతో ముగిసిన పారిస్ ఒలింపిక్స్

పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలు ఆదివారం (ఆగస్ట్ 11) పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో ముగిశాయి. ఈ విశ్వ క్రీడలకు టామ్ క్రూజ్ అద్భుతమైన హై-ప్రొఫైల్ ముగింపును ఇచ్చాడు. ఊహకందని విన్యాసం చేస్తూ.. క్రూజ్ ఫ్రాన్స్ జాతీయ స్టేడియం పై నుండి క్రిందికి దిగారు. బ్యాక్ గ్రౌండ్ లో మిషన్ ఇంపాజిబుల్ థీమ్ సాంగ్ ప్లే చేయబడింది. అతను చేసిన ఈ నమ్మశక్యం కాని స్టంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం క్రూజ్ చేసిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.   

మైదానంలోకి తిరిగి వచ్చిన తర్వాత అతను వేదికపై ఉన్న క్రీడాకారులతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తన బైక్‌పై వెళ్లే ముందు జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నుండి ఒలింపిక్ జెండాను తీసుకున్నాడు. ఈసారి విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీపడగా.. కనీసం 10 నుంచి 15 పతకాలైనా వస్తాయని అభిమానులు ఆశించారు. కానీ, అభిమానుల ఆశలు ఫలించలేదు. ఊరించి ఊరించి చివరికి ఆరు పతకాలతో సరిపెట్టుకుంది మన దేశం. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకం ఉన్నాయి.