టమాట లోడ్ బోల్తా... ఎత్తుకుపోకుండా పోలీసుల కాపలా

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండర గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం టమాట లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఏపీలోని చింతామనుగురు నుంచి మహరాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాకు టమాట లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో టమాటలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడిపోయాయి. వాహనంలో సుమారు రూ.10 లక్షల విలువైన11 టన్నుల టమాటలు ఉన్నాయని, డ్రైవర్​పోలీసులకు ఫోన్​చేశాడు. దీంతో వాంకిడి పోలీస్​స్టేషన్​ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్​ వచ్చి కాపలా కాశారు.  రాత్రి వరకు టమాటలు ఎవరూ ఎత్తుకుపోకుండా చూశారు. చివరకు మరో వాహనం తెప్పించి అందులో టమాటలు ఎక్కించి తరలించారు.