అమాంతం తగ్గిన టమాటా ధరలు.. రైతులు ఎలా బతికేది..!

టమాట ధరలు అమాంతం తగ్గిపోయాయి.. అవును.. 2024, జూలై నెలలో కిలో టమాటా అక్షరాల వంద రూపాయలు టచ్ అయ్యింది.. అమ్మో.. అయ్యో అంటూ టమాటా జోలికి వెళ్లటం మానేశారు జనం.. దీనికితోడు వర్షాలు పడుతుండటం.. కొత్త సరుకు రావటంతోపాటు.. జనం వినియోగం భారీగా తగ్గటంతో.. టమాటా ధరలు సైతం అమాంతం తగ్గిపోయాయి. హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా 20 రూపాయలకు పడిపోయింది. 

ఇక సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ లో కిలో టమాటా 30 రూపాయలకు చేరింది. జస్ట్ 15 అంటే 15 రోజుల్లోనే టమాటా ధర 100 రూపాయల నుంచి 20 రూపాయలకు పడిపోవటంతో.. జనం హ్యాపీగానే ఉన్నా.. రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. టమాటా ధర బాగుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున పంట సాగు చేశారు. పంట మార్పిడి కింద.. టమాటాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఈసారి టమాటా సాగు చేపట్టారు రైతులు. 

కొత్త పంట చేతికి వచ్చిన తర్వాత.. మార్కెట్ కు తీసుకొస్తే ధర మాత్రం ఢమాల్ అనటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అమాంతం పెరగటం.. అమాంతం తగ్గటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగితే 100 రూపాయలు.. తగ్గితే 20 రూపాయలు ఏంటీ అంటూ వ్యాపారులపై మండిపడుతున్నారు.

హోల్ సేల్ మార్కెట్ లోనే కిలో టమాటా 20 రూపాయలు అంటే.. ఇక రైతులకు కిలో 10 నుంచి 15 రూపాయల వరకు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. పెరిగిన రవాణా ఖర్చులు, సాగు ఖర్చులు లెక్కిస్తే.. మార్కెట్ లో గిట్టుబాటు ధర రావటం లేదని మనోవేదన చెందుతున్నారు రైతులు. 

అమాంతం తగ్గకుండా.. అమాంతం ధర పెరగకుండా.. మధ్యస్తంగా.. గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు.