మళ్లీ పెరుగుతున్న టమోటా..రైతు బజార్లలో కిలో రూ. 50 పైనే..

మళ్లీ పెరుగుతున్న టమోటా..రైతు బజార్లలో కిలో రూ. 50 పైనే..

మార్కెట్‌లో మళ్లీ పెరుగుతున్న టమాట ధరల సెగ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కు తగులుతున్నది. తగ్గినట్టే తగ్గి తిరిగి పుంజుకున్న టమాట రేట్లు.. హైదరాబాద్​ రైతు బజార్లలో  కిలో రూ.50 దాటింది .. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబైల్లో కిలో టమాట రూ.90 పలుకుతున్నది.

మార్కెట్ లో టమాటా ధర మళ్లీ పెరిగిపోయింది.తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర మళ్లీ పరుగులు పెడుతోంది. కిలో టమాటా ధర  రైతు బజార్లలో రూ.50గా విక్రయిస్తున్నారు.   దీంతో సామాన్య ప్రజలు టమాటాల ధరలను చూసి వాపోతున్నారు. కాగా, ఇలా ధరలు పెరగడానికి కారణం.. పంట సాగును కొనసాగించడానికి నీరు లేకపోవడమే తక్కువ దిగుబడి వస్తుందని రైతన్నలు చెబుతున్నారు. వారం క్రితం కిలో రూ.9 నుంచి రూ.10కి విక్రయించిన ధరలు ఇప్పుడు  దాదాపు ఐదు రెట్లు దాటింది.  అంటే రైతు బజార్​ లో ప్రస్తుతం టమాటా రేటు రూ. 50లు దాటింది. 

Also Read :- తెలంగాణలో భారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కూరగాయాలు ఏదైనా ఉంది అంటే అది టమాటా అనే చెప్పావచ్చు. ఎందుకంటే.. ఇటీవలే కొంచెం తగ్గినట్లు తగ్గి మళ్లీ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ టమాటాలు ఇలా అధికంగా పెరగడానికి కారణం.. పంటను సాగు చేయడానకి కావలసిన నీరు లేకపోవడమే అంటున్నారు రైతులు. అసలు సరైనా సమయంలో వర్షలు పడకపోవడం, పంట చేతికి వచ్చే సమయంలో.. ఆకాల వర్షాలతో ఇలా పంట దిగుబడి చేతికందటం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇలా మర్కెట్ లో మరోసారి టమాటా ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు వాటిని కొనాలన్నా, వినియోగించాలన్న భయపడుతున్నారు. అయితే తాజాగా రాష్ట్రంలో వారం క్రితం విక్రయించిన టమాటా ధర ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది.

Also Read :- యాదాద్రిలో 56 మంది ఉద్యోగుల బదిలీ

వాతావరణ మార్పులతో గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా టమాటా సరఫరాకు అంతరాయం కలిగించాయని వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా ( జులై 17 నాటికి)  పరిస్థితి మరింత దిగజారింది.  పరిమిత సరఫరా టోకు ధరలలో తీవ్ర పెరుగుదలకు కారణమైందని, ఫలితంగా రిటైల్ ధరలను కూడా ప్రభావితం చేసిందని వ్యవసాయశాఖాధికారులు చెప్పారు.  టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు,  టమాట పంట ఎంత త్వరగా చేతికి వస్తే అంత త్వరగా ధరల తగ్గుదల ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కిలో రూ.20 నుంచి 40 మధ్య వచ్చే అవకాశం ఇప్పుడే లేదన్నారు.