భగ్గుమన్న టమాట ధర ..  కిలో @ రూ.80లు

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​లోని లక్ష్మిపురం కూరగాయల మార్కెట్ లో కిలో టమాట ధర ఒక్కసారిగా భగ్గుమంది. మంగళవారం గరిష్టంగా రూ.80లు ధర పలికింది. గత నెల రోజుల క్రితం కిలో టమాట ధర రూ.40 నుంచి రూ.50 మాత్రమే పలికేది. కానీ, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండడంతో ఒక్కసారిగా టమాట ధర భారీగా పెరిగింది.