
- 10 బాక్సుల విలువ రూ.40 వేలు
సదాశివపేట, వెలుగు: టమాట ధరలు పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మార్కెట్లో దొంగలు టమాటలు ఎత్తుకెళ్లారు. సదాశివపేట కూరగాయల మార్కెట్ యార్డ్‌లో (బీట్) లో రాములు అనే కూరగాయాల వ్యాపారి షాపులో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ.40 వేల విలువైన 10 బాక్స్‌ల టమాటలు చోరీ చేశారు.
ఐరన్ గ్రిల్స్ వంచి లోపలున్న టమాటలు మాయం చేశారు. తెల్లారి షాపుకు వచ్చిన రాములు గ్రిల్స్వంచి ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా టమాటలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సదాశివపేట సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.