- టమాటాల చోరీ..
- 8 కూరగాయల ట్రేలు ఎత్తుకెళ్లిన దుండగులు
- సదాశివపేట మార్కెట్లో ఘటన
సంగారెడ్డి : సదాశివపేట మార్కెట్లో అర్ధరాత్రి టమాటాల దొంగతనం జరిగింది. కూరగాయల వ్యాపారి నరేశ్ చెందిన షాపులోకి దుండగులు చొరబడి 6 టమాట బాక్సులు, రెండు చిక్కుడుకాయ ట్రేలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరిచి చూసేసరికి దాదాపు రూ.30 వేల కూరగాయలు మాయం కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.