తెలంగాణ వాసులకు టామ్‌కామ్ గుడ్ న్యూస్.. జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలకు జాబ్ మేళా

హైదరాబాద్: డ్రైవింగ్‎పై ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) శుభవార్త చెప్పింది. జర్మనీలో బస్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టామ్‎కామ్ ప్రకటించింది. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, వేతనం, సెలక్షన్ ప్రాసెస్ వంటి వివరాలను టామ్ కామ్ వెల్లడించింది. అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం www.tomcom.telangana.gov.inని సందర్శించవచ్చు.. లేదా 9440052592 , 8125251408 , 9440049013 , లేదా 9440049645 నెంబర్లకు కాల్ చేసి డిటెయిల్స్ తెలుసుకోవచ్చని సూచించింది. 

Also Read :- తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ

ఉద్యోగ అర్హతలు ఇవే:

  • బస్ డ్రైవర్ జాబ్‎కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా రెండేళ్ల ఎక్స్ పీరియన్స్‎తో కూడిన హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • డ్రైవర్ పోస్టుకు అప్లై చేసే వారి వయస్సు 24 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 
  • అభ్యర్థులు తప్పనిసరిగా A2 స్థాయిలో జర్మన్ భాషాపై పట్టు సాధించాలి.
  • అభ్యర్థులు జర్మన్ భాషా నేర్చుకోవడంలో టామ్ కామ్ సహయం అందిస్తుంది. 

వేతనం:

  • అన్ని టెస్టులు పాసై ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 2,18,000 వరకు సంపాదించవచ్చు. 

టామ్‎కామ్ అంటే ఏమిటి..?

తెలంగాణా ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ క్రింద రిజిస్టర్డ్ అయిన జాబ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీనే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్). తెలంగాణలో అర్హత, నైపుణ్యం కలిగిన వారికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. టామ్‎కామ్ ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు యూరప్‌లోని జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, బ్రిటన్, గల్ఫ్ దేశాలలో తెలంగాణ వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తుంది.