యూరప్ లో ఉద్యోగాలు.. జీతం రెండు లక్షలు..

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ యూరప్ లో ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో రిక్రూట్మెంట్ చేపట్టింది. జర్మనీ ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ తో ట్రిపుల్ విన్ ఒప్పందం చేసుకున్న టామ్ కామ్ జర్మనీలో రిక్రూట్ అయ్యే నర్సులకు జర్మన్ భాష శిక్షణ కోసం ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్రోల్ మెంట్ కార్యక్రమం చేపట్టింది.ఈ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే టామ్ కామ్ నిర్దేశించిన క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి.

యూరప్ లో ఉద్యోగం పొందాలంటే ఈ కింది అర్హతలు కలిగి ఉండాలి:

తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కాలేజ్ నుండి జీఎన్ఏం లేదా బీ.ఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసి ఉండాలి.
21-38 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
1-3 సంవత్సరాల ప్రొఫెషనల్ లేదా క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి.
జర్మన్ భాష తెలిసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

జీతం:

ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎంపికైన అభ్యర్థులు ముందుగా B1 భాషా శిక్షణను ఇండియాలో పూర్తి చేయాలి. తర్వాత జర్మనీలో అసిస్టెంట్ నర్స్ గా పని చేయచ్చు.జర్మనీలో B2 మరియు గుర్తింపు పరీక్షలను క్లియర్ చేసిన తర్వాత వారు రిజిస్టర్డ్ నర్సులుగా ప్రమోట్ అవుతారు.ఆ తర్వాత యూరప్ లో కనీసం 2300 నుండి 2800 యూరోల జీతం గల ఉద్యోగానికి అర్హత పొందుతారు. ఇది ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల నుండి రెండున్నర లక్షల వరకు ఉంటుంది.