ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఓటేసేందుకు నవంబర్​ 30న సెలవు

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు (నవంబర్​ 30)  సెలవు ప్రకటించింది.  తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు. 

 ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఉద్యోగులు హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వారు తెలంగాణలో నవండర్​ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటే.. వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తున్నట్లు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ఈ సెలవు మంజూరు చేస్తున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నవంబర్​ 30న  సెలవు ప్రకటించడంతో పాటు ఓటింగ్ లో పాల్గొనేలా తగిన చర్యలు తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వినతిని కూడా ఏపీ సీఈఓ ముఖ్య ఎన్నికల అధికారి అంగీకరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవు కావాలని కోరుకుంటున్న ఏపీ ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందేలా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు ఇది మేలు చేయనుంది.

Also Read:- భక్తులకు అలర్ట్ : తిరుమలలో భారీ వర్షాలు.. మరో 4 రోజులు కూడా