రేపే ఆరో విడత లోక్ సభ ఎన్నికలు

రేపే ఆరో విడత లోక్ సభ ఎన్నికలు
  • 6 రాష్ట్రాలు/యూటీల్లో 58 సీట్లకు
  • పోలింగ్.. 889 మంది బరిలో..

న్యూఢిల్లీ: లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఆరు రాష్ట్రాలు, యూటీల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, బిహార్ లో 8, హర్యానాలో 10, జమ్మూకాశ్మీర్ లో 1, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, ఉత్తర ప్రదేశ్ లో 14, వెస్ట్ బెంగాల్ లో 8 లోక్ సభ స్థానాలకు ఓటింగ్  నిర్వహించనున్నారు.

మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రీషెడ్యూల్  చేసిన జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్–రాజౌరీలో 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరో విడతలో యూపీలోని 14 నియోజకవర్గాల్లో 470 మంది నామినేషన్లు వేశారు. 10 స్థానాల్లో 370 మంది అభ్యర్థులతో  హర్యానా రెండో స్థానంలో నిలిచింది. ఆరో విడతలో ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి సగటున 15 మంది అభ్యర్థులు పోటీ చేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.