ఖమ్మంలో రేపు టీడీపీ బహిరంగ సభ..హాజరుకానున్న చంద్రబాబు

రేపు(బుధవారం) ఖమ్మంలో భారీ బహిరంగసభకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది . సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఖమ్మంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ టీడీపీ నేతలు ఖమ్మం నగరంలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనాన్ని సమీకరించేందుకు ప్లాన్ చేస్తున్నరు. 


రాష్ట్రంలో మళ్లీ టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఆ పార్ఠీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు. ఈ మధ్యే బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ఆర్  కాలేజ్ మైదానంలో జరగనున్న ఈ బహిరంగసభకు చంద్రబాబు హాజరుకానుండటంతో   పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నామన్నారు