టానిక్ లిక్కర్ షాపులన్నీ రాత్రి 11గంటలకు బంద్

టానిక్ లిక్కర్ షాపులన్నీ రాత్రి 11గంటలకు బంద్

టానిక్ షాపు నిర్వాహకులకు  ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది.  అర్థ రాత్రి 2 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు  గత ప్రభుత్వం ఇచ్చిన  జీవో వెసులుబాటును కుదించింది ఎక్సైజ్ శాఖ.  టానిక్ లిక్కర్ షాపులన్నీ రాత్రి 11గంటలకు మూసివేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

ALSO READ :- రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు వంశీకృష్ణ పరామర్శ

టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు..టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు ఉన్నట్లు గుర్తించారు. టానిక్ గ్రూప్స్ కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్ కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ శాఖ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెప్తున్నారు.