పర్యావరణ ప్యాకేజీ300 బిలియన్ డాలర్లేనా: కాప్ 29 నిర్ణయంపై భారత్ అసంతృప్తి

పర్యావరణ ప్యాకేజీ300 బిలియన్ డాలర్లేనా: కాప్ 29 నిర్ణయంపై భారత్ అసంతృప్తి

బకూ (అజర్ బైజాన్):  వాతవరణ మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు 300 బిలియన్ల డాలర్ల (రూ. 25 లక్షల కోట్లు) సాయాన్ని అందించాలని కాప్–29 నిర్ణయించింది. అయితే, ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా యునైటైడ్ నేషన్స్ కాప్–29 చర్చలు ఆదివారం కొనసాగాయి. వాతావరణ మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని 300 బిలియన్ డాలర్లుగా నిర్ణయించాయి. అయితే, ఆ నిధులు ఏ మాత్రం సరిపోవని ఈ ఒప్పందంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.