చిట్యాల వెలుగు : చిట్యాల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి వర్క్ హాలిడే (టూల్ డౌన్ ) జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేశ్ కోరారు. బుధవారం టూల్ డౌన్ కరపత్రాలను ఆయన వివిధ భవన నిర్మాణ కార్మక సంఘాల ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు.
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎలక్ట్రిషియన్ల రేట్లు పెంచాలన్నారు. తాడూరు చంద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు వరికుప్పల హన్మంతు,తోట శ్రవణ్ కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు బరాల స్వామి, సీనియర్ నాయకులు బెల్లి యాదయ్య పాల్గొన్నారు.