లింగ నిర్ధారణ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

లింగ నిర్ధారణ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని దవాఖానలు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-3366 కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. టోల్ ఫ్రీ  నంబర్​తో పాటు పబ్లిక్​ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్​పై పీహెచ్​సీ వైద్య, ఆరోగ్య అధికారుల కరదీపికను ఆవిష్కరించారు. ఈ టోల్ ఫ్రీ నంబర్​ను అన్ని స్కానింగ్ సెంటర్లలో ప్రదర్శించాలన్నారు. డిసెంబర్ లో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

Also Read:-సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో బాధితులు