డ్యాన్సింగ్ శాంట
క్రిస్మస్ వచ్చిందంటే పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంటుంది. శాంటా క్లాజ్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్లకు శాంటా క్లాజ్నే గిఫ్ట్‌గా ఇస్తే చాలా సంతోషిస్తారు. పెప్స్టర్ అనే కంపెనీ ఈ డ్యాన్సింగ్ శాంటాని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తలకిందులుగా ఉండే ఈ శాంటా పవర్ బటన్ ఆన్ చేస్తే.. పాట పాడుతూ.. గుండ్రంగా తిరుగుతుంది. దీన్ని పిల్లలకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకే కాదు.. ఇంట్లో డెకరేషన్ కోసం కూడా వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ శాంతా క్లాజ్ ప్యానెల్స్‌ని క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారుచేశారు. ఇది డ్యాన్స్ చేయాలంటే మూడు ఏఏ బ్యాటరీలు వేయాలి.
ఉడెన్ క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ రోజు ఇండ్లతోపాటు మాల్స్, హోటల్స్‌లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా క్రిస్మస్ ట్రీలను పెడుతుంటారు. అలా పెట్టుకోవడానికి ఇది బెస్ట్. దీన్ని ది క్రాఫ్ట్స్ హెవెన్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. తెలుపు రంగు బిర్చ్ ప్లైవుడ్‌తో తయారు చేసిన ఈ ట్రీ 12 అంగుళాల ఎత్తు, 3 మిల్లీమీటర్ల మందంతో వస్తుంది. దీనికి వెనుకభాగంలో ఒక మల్టీ కలర్ ఎల్ఈడీ లైట్ ఉంటుంది. చీకట్లో ఆ లైట్ ఆన్ చేస్తే.. ట్రీ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. చెట్టు మధ్యలో స్టార్స్, కింది భాగంలో జింక ఆకారాలు ఉంటాయి. కాకపోతే దీని లైట్ వెలగాలంటే రెండు ఏఏ బ్యాటరీలు వేయాలి.
స్టార్ మాస్టర్
సాధారణంగా క్రిస్మస్కి ఇంటిని లైట్లతో డెకరేట్ చేస్తారు. కానీ.. ఈ లైట్‌తో గదులను కూడా డెకరేట్ చేయొచ్చు. జెనరిక్ అనే కంపెనీ ‘స్టార్ మాస్టర్’ పేరుతో ఈ ల్యాంప్ ప్రొజెక్టర్‌ని తీసుకొచ్చింది. దీన్ని గదిలో పెట్టి ఆన్ చేస్తే.. 360 డిగ్రీల్లో స్టార్, చందమామ ఆకారాలను ప్రొజెక్ట్ చేస్తుంది. రాత్రి పూట వాటి కిందే పడుకున్నట్టు అనిపిస్తుంది. దీన్ని మొత్తం ఎనిమిది మోడ్స్‌లోకి మార్చుకోవచ్చు. ఒక్కో మోడ్‌లో ఒక్కో ఆకారంలో లైట్‌ని ప్రొజెక్ట్ చేస్తుంది. లైట్‌ని కంట్రోల్ చేయడానికి మూడు బటన్‌లు ఉంటాయి. బటన్ ఏ: ఆన్/ఆఫ్ చేయడానికి, బటన్ బీ: లైట్ రంగులు మార్చడానికి (వార్మ్ వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, మల్టీ కలర్), బటన్ సీ: రోటేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. స్టార్ మాస్టర్‌లో నాలుగు ఏఏఏ బ్యాటరీలు వేయాల్సి ఉంటుంది. లేదంటే.. యూఎస్బీ పోర్ట్‌తో కనెక్ట్ చేయాలి. యూఎస్బీ కేబుల్, బ్యాటరీలు.. రెండింటినీ ఒకేసారి వాడకూడదు.