టూల్స్ గాడ్జెట్స్ : కార్​ రేడియో

టూల్స్ గాడ్జెట్స్ : కార్​ రేడియో

కార్​ రేడియో

ఈ ఒక్క గాడ్జెట్​ కారులో ఉంటే ఎన్నో పనులు ఈజీగా చేసుకోవచ్చు. ఆంబ్రనె కంపెనీ తెచ్చిన ఈ మల్టీపర్సస్​ గాడ్జెట్​ని కారులోని12 వోల్ట్స్​ సాకెట్​కి కనెక్ట్​ చేయాలి. బ్లూటూత్​ ద్వారా ఫోన్​కి కనెక్ట్​ చేసుకుని వైర్‌‌లెస్ ఆడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్​ మాట్లాడుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో ఎఫ్​ఎం ట్రాన్స్‌‌మీటర్ కూడా ఉంది. దీన్ని ఛార్జర్​లా కూడా వాడుకోవచ్చు. టైప్​ ఏ, టైప్​ సీ పోర్ట్​లు ఉన్నాయి దీనికి. గరిష్టంగా 30 వాట్స్​ వరకు అవుట్​పుట్​ ఇస్తుంది. ఇందులో యూఎస్​బీ ఫ్లాష్​ డ్రైవ్​ కూడా ఉంటుంది. ఇయర్​ఫోన్స్​ పెట్టుకోవడానికి 3.5 ఎంఎం ఫిమేల్​ పోర్ట్​ ఉంది. ఈ గాడ్జెట్​లో ఇన్​బిల్ట్​ బ్యాటరీ మానిటర్​ ఉంటుంది. ఇది కారులోని బ్యాటరీ పనితీరు, హెల్త్​ని కనిపెడుతుంది. 

ధర : 420 రూపాయలు 

ఇండోర్​ కెమెరా

ఇంట్లో చిన్నపిల్లలు, పెట్స్​ ఉంటే.. ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండాలి. అలాంటప్పుడు ఈ ఇండోర్​ కెమెరా వాడాలి. దీన్ని పీకేఎస్టీ అనే కంపెనీ తయారుచేసింది. ఇది 2-ఇన్-1 డిజైన్‌‌తో వస్తుంది. అంటే ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి. ఒక్కోదాన్ని ఒక్కోవైపు తిప్పి పెట్టుకోవచ్చు. రెండు హై–రెజల్యూషన్ బుల్లెట్ కెమెరాలు. పాన్–టిల్ట్–జూమ్ టెక్నాలజీతో వస్తాయి. గదిలో రెండు వైపులా ఒకేసారి రికార్డ్​ చేస్తాయి. 4ఎంపీ  హై-డెఫినిషన్ రెజల్యూషన్‌‌తో క్రిస్టల్-క్లియర్ ఇమేజ్​ని ఇస్తుంది. ఇది డ్యుయల్ వైఫై బ్యాండ్స్​(2.5, 5.0)తో వైర్‌‌లెస్ కనెక్టివిటీకి సపోర్ట్​ చేస్తుంది. ఇందులో ఏఐ పవర్​డ్​​ హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. మనిషి లేదా పెట్స్​ కదలికలను గుర్తించినప్పుడు స్మార్ట్‌‌ఫోన్‌‌కు అలర్ట్​ పంపుతుంది. ఇందులో స్పీకర్, ఎస్డీ కార్డ్​ స్లాట్​ కూడా ఉంటాయి. ఇన్​స్టలేషన్​ కూడా ఈజీ. దీంతోపాటు కిట్​లో వచ్చే హోల్డర్​ని సీలింగ్​కి బిగించి, దానికి బల్బ్​ పెట్టినట్టు పెడితే సరిపోతుంది. 

ధర : 1,800 రూపాయలు 

సిలికాన్​ మ్యాట్స్​

అన్నం, కూర.. పొయ్యి మీది నుంచి దించగానే వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది చాలామందికి. అందుకే వెంటనే వాటిని డైనింగ్​ టేబుల్​ మీదికి షిఫ్ట్​ చేస్తారు. కానీ.. చాలా రకాల టేబుల్స్​ అంత వేడిని తట్టుకోలేవు. అందుకే త్వరగా పాడైపోతాయి. వేడివనే కాదు బాగా చల్లగా ఉన్నవి పెట్టినా పాడైపోతాయి. అందుకే అలాంటి వాటిని టేబుల్​ మీద పెట్టే ముందు సిలికాన్​ మ్యాట్స్​ వేయాలి. ఇవి –100 ఫారెన్​హీట్​ నుంచి 440 ఫారెన్​హీట్​ వరకు చలిని, వేడిని తట్టుకుంటాయి. వేడి లేదా చలి నేరుగా టేబుల్​కి తగలకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు వండిన గిన్నెల మూతలు తీసేటప్పుడు, మూత పెట్టేటప్పుడు కూడా చేతులకు వేడి తగలకుండా వీటితో పట్టుకోవచ్చు. 

ధర : నాలుగింటికి 229 రూపాయలు

సేఫ్టీ లాకర్​

చేతిలో ఫోన్​ ఉంటే చాలు.. ఇంట్లో ఉండే గాడ్జెట్స్​ చాలావరకు కంట్రోల్​ చేయొచ్చు. ఫోన్​తో కంట్రోల్​ చేయగలిగే సేఫ్టీ లాకర్లు కూడా మార్కెట్​లోకి వచ్చేశాయి. ఈ లాకర్​ని ఓజోన్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీన్ని స్టెయిన్‌‌లెస్ స్టీల్‌‌తో తయారుచేశారు. ఇందులో మూడు లాకింగ్ బోల్ట్‌‌లు ఉంటాయి. చాలా బలమైన లాకింగ్ మెకానిజం ఉంటుంది. లాకర్​ లోపల 45 లీటర్ల స్పేస్​ ఉంటుంది. ఇండ్లతోపాటు ఆఫీస్​, రిటైల్ షాపుల్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని నాలుగు రకాలుగా యాక్సెస్​ చేయొచ్చు. లాకర్​కు ఉండే ఫింగర్​ ప్రింట్​ స్కానర్​తో ఓపెన్​ చేసుకోవచ్చు. ఇది 30 వరకు వేళ్ల ముద్రలను గుర్తుంచుకుంటుంది. అంతేకాదు.. డయల్​ప్యాడ్​లో ఉండే నెంబర్లను ఉపయోగించి 3 నుండి 12-అంకెల పాస్​వర్డ్​ పెట్టుకోవచ్చు. లాకర్​కి వైఫై ద్వారా ఇంటర్నెట్​ కనెక్ట్​ చేసి స్మార్ట్​ఫోన్​తో యాక్సెస్​ చేయొచ్చు. ఫోన్​లో ప్లే స్టోర్ నుంచి ఓజోలైఫ్ అనే యాప్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకుని దీన్ని కంట్రోల్​ చేయొచ్చు. అంతేకాదు.. దీనికి ఎమర్జెన్సీ ‘కీ’ ఉంది. ఇందులో బ్యాటరీ లో అయితే దాన్ని చెప్పే ఇండికేషన్​ ఫీచర్​ కూడా ఉంది. బ్యాటరీ లెవల్​ తగ్గగానే అలర్ట్ చేస్తుంది. ఒకవేళ బ్యాటరీలో ఛార్జింగ్​ పూర్తిగా అయిపోతే.. బయటినుంచి మరో ఎమర్జెన్సీ బ్యాకప్- బ్యాటరీని కనెక్ట్​ చేసుకోవచ్చు. ఇందులో ఆటోలాకింగ్​ ఫీచర్​ కూడా ఉంది. లాకర్​ డోర్​ మూసిన వెంటనే ఆటోమేటిక్‌‌గా లాక్ అయిపోతుంది. లాకర్​లో ఎల్​ఈడీ లైట్​ కూడా ఉంటుంది. చీకట్లో తెరిచినా అందులో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. 

ధర : 14,796 రూపాయలు