ట్రాన్స్‌లేటర్
విదేశాలకు వెళ్లినప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య కమ్యూనికేషన్. భాష తెలియక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ డివైజ్ పక్కన ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. కుడో కంపెనీ తీసుకొచ్చిన ఈ డివైజ్ రియల్ టైమ్ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తుంది. 107 భాషలతోపాటు కొన్ని మాండలికాలను కూడా అర్థం చేసుకుని ట్రాన్స్‌లేట్ చేయగలుగుతుంది. అంటే.. విదేశాలకు వెళ్లినప్పుడు బటన్ నొక్కి మనకు తెలిసిన భాషలో డివైజ్‌కు విషయం చెప్తే.. అదే విషయాన్ని అక్కడివాళ్లకు వాళ్ల భాషలో చెప్తుంది. వైఫైకు కనెక్ట్ చేసి స్మార్ట్ ట్రాన్స్‌లేటర్‌గా కూడా వాడుకోవచ్చు. అంటే ఏదైనా బ్రోచర్, ఫుడ్ మెనూ లాంటివాటిని ఫొటో తీస్తే.. అందులోని వివరాలను మనకు అర్థమయ్యే భాషలో వినిపిస్తుంది. ఇందులో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ డివైజ్‌కు మూడు అంగుళాల హై-డెఫినిషన్ టచ్ స్క్రీన్ ఉంటుంది.1500mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది.
ధర : 13,500 రూపాయలు
కొలాప్ ఇ - మార్క్
చిన్న చిన్న పార్టీల నుంచి ఫంక్షన్ హాల్స్‌లో చేసే ఈవెంట్ల వరకు ఏది చేసినా గెస్ట్‌ల కోసం రకరకాల సైన్ బోర్డ్స్ పెడుతుంటారు. ‘‘ఇక్కడ డస్ట్ బిన్ ఉంది. టాయిలెట్స్‌కు దారి. భోజనాలు చేసే గది...” ఇలాంటి బోర్డ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని అప్పటికప్పుడు తయారు చేయించడమంటే చాలా కష్టం. కానీ.. ఇలాంటప్పుడు కొలాప్ ఇ – మార్క్ డివైజ్‌ని వాడి ఎలాంటి ప్రింట్ అయినా తీసుకోవచ్చు. దీన్ని మొబైల్‌తో కనెక్ట్ చేసి వాడుకోవాలి. దీనికి సంబంధించిన యాప్‌లో చాలా రకాల టెంప్లెట్స్ ఉంటాయి. వాటిని ఎడిట్ చేసుకుని పేపర్ లేదా ఏ వస్తువు మీద అయినా ప్రింట్ చేయొచ్చు. దీన్ని బ్రాండింగ్, యాడ్స్, లేబులింగ్, నెంబరింగ్, టైం, తేదీ మార్కింగ్, బార్‌కోడ్, క్యూఆర్ కోడింగ్ లాంటి అన్ని పనులకు వాడుకోవచ్చు. ఇందులో ఉండే ఒక ఇంక్ క్యాట్రిడ్జ్‌తో 2,000 మల్టీ కలర్ ప్రింట్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మార్చుకోవడం కూడా చాలా ఈజీ.
ధర : 18,000 రూపాయలు
నెయిల్ క్లిప్పర్
చాలామందికి గోర్లు కత్తిరించుకోవడం రాక వేళ్లు కత్తిరించుకుంటారు. ముఖ్యంగా ఎప్పుడూ కదులుతూ ఉండే పిల్లల గోర్లు కట్ చేయడం చాలా కష్టం. అలాంటి వాళ్లకు ఈ డివైస్ బెస్ట్ చాయిస్. డిర్‌గ్లస్ అనే కంపెనీ ‘సీ మ్యాజిక్’ పేరుతో ఈ నెయిల్ క్లిప్పర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. వేలికి గాయం కాకుండా గోర్లను కత్తిరిస్తుంది. హైస్పీడ్ మోటార్‌తో పనిచేస్తుంది. కత్తిరించిన గోర్లను దాని
లోపల ఉన్న స్టోరేజీ స్పేస్‌లోకి పంపుతుంది.
ధర : 8,000 రూపాయలు
ఎక్స్‌పాండబుల్ లగేజ్ సూట్‌కేస్
లాంగ్ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు ఎక్కువ లగేజీ, షార్ట్ ట్రిప్‌లకు వెళ్లినప్పుడు తక్కువ లగేజీ తీసుకెళ్తుంటారు. అందుకోసం వివిధ సైజుల్లో బ్యాగులు కొని పెట్టుకుంటారు. కానీ.. ఈ లగేజ్ సూట్‌కేస్ ఉంటే అలా మూడు నాలుగు బ్యాగులు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇది హార్డ్-సైడ్ ఎక్స్‌పాండబుల్ సూట్‌కేస్. దీన్ని మూడు సైజుల్లోకి మార్చుకోవచ్చు. 16 అంగుళాల స్మాల్ క్యారీ-ఆన్, 22 అంగుళాల మీడియం చెక్–ఇన్, 26 అంగుళాల పెద్ద చెక్–ఇన్‌గా కూడా వాడుకోవచ్చు.
ధర : సుమారు 30,000 రూపాయలు