
ఈ కీబోర్డ్‌ని మడత పెట్టొచ్చు. చుట్టలా చుట్టి ఓ డబ్బాలో పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అవసరమైనప్పుడు చాపలా పరిచి వాడుకోవచ్చు. ఈ కెమెరాను ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పవర్‌ని కూడా సోలార్ ద్వారా అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇక పిల్లల కోసం వచ్చిన బుల్లి ఫౌంటెన్. దీనికైతే కరెంట్‌తో పనేలేదు. సూర్య కాంతి ఉన్నంత సేపు నీళ్లు చిమ్ముతూనే ఉంటుంది.
ALSO READ: స్పెషల్ : టొమాటాలకు టేప్ వేయండి!
సోలార్ కెమెరా
కొంతమంది పొలాల దగ్గర, ఇంటి పక్కన బైక్ పార్క్ చేసే చోట సీసీ కెమెరాలు పెట్టాలి అనుకుంటారు. అలాంటివాళ్లకు మొదట ఎదురయ్యే సమస్య.. సీసీ కెమెరాకు పవర్ సప్లై. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ యాక్టివ్ పిక్సెల్‌ని వాడొచ్చు. ఇది 100 శాతం వైర్లెస్ కెమెరా. సోలార్ పవర్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. కదిలే వస్తువులను గుర్తించి ఫోన్‌కి నోటిఫికేషన్ కూడా పంపుతుంది. ఈ కెమెరాలో స్పీకర్, మైక్రోఫోన్ కూడా ఉంటాయి. ఒకేసారి అయిదు ఫోన్లలో లైవ్ వీడియో చూడొచ్చు. కాకపోతే.. ఈ ఫీచర్లు పనిచేయాలంటే దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలి. ఒకవేళ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే.. దీనికి ఉండే ఎస్‌డీ కార్డ్ స్లాట్‌లో 128 జీబీ వరకు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అందులో వీడియో రికార్డ్ అవుతుంది. ఈ 2 ఎంపీ కెమెరా 1080పీ క్వాలిటీతో వీడియోని రికార్డ్ చేస్తుంది. దీన్ని యాక్టివ్ పిక్సెల్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది.
ధర: 6,999 రూపాయలు
వాటర్ ఫౌంటెన్
ఇంటి బయట వాటర్ ఫౌంటెన్ ఉంటే బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. అలాగని దానికోసం ఎక్కువ ఖర్చు చేయడం పెద్దవాళ్లకు కష్టంగా అనిపిస్తుంది. అలాంటివాళ్లకు సోలార్ ఫౌంటెన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సోలార్ పవర్‌తో పనిచేస్తుంది కాబట్టి బ్యాటరీ అవసరం లేదు. మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్‌తో వస్తుంది. తగినంత ఎండ ఉంటే చాలు పనిచేస్తుంది. ఐదు రకాల ఫౌంటెన్ అడ్జస్ట్‌మెంట్స్ నాజిల్స్ ఉన్నాయి. 30–55 సెంటీమీటర్ల వరకు నీటిని వెదజల్లుతుంది. పక్షుల స్నానానికి, చేపల ట్యాంక్, కొలనులోకూడా దీన్ని వాడుకోవచ్చు. సోలార్ ప్యానెల్‌కు పవర్ అందిన మూడు సెకన్లలో పనిచేయడం మొదలవుతుంది. దీన్ని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ చేసి నీటిలో వేస్తే చాలు. డియోక్సిస్ అనే కంపెనీ దీన్ని తెచ్చింది.
ధర: 849 రూపాయలు
ఫోల్డబుల్ కీబోర్డ్
మనతో ల్యాప్‌టాప్ తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. కీ బోర్డ్ తీసుకెళ్లడమే కాస్త కష్టం. అలాంటప్పుడు ఈ ఫోల్డబుల్ కీబోర్డ్ మంచి ఆప్షన్. దీన్ని రబ్బర్‌తో తయారుచేస్తారు. అందుకే బట్టలు మడత పెట్టినట్టు దీన్ని ఫోల్డ్ చేయొచ్చు. ల్యాప్‌టాప్, పీసీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఐవోఎస్, ఆండ్రాయిడ్, మాక్, విండోస్... దేనికైనా సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా స్లిమ్, లైట్‌వెయిట్ కాంపాక్ట్ డిజైన్ వల్ల ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఇబ్బంది ఉండదు. గ్రీన్ ఎల్ఈడీ పవర్ ఇండికేటర్ ఉంటుంది. ఇది డస్ట్, వాటర్ ప్రూఫ్‌తో వస్తుంది. దీన్ని హరిక్రుపెక్స్ కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. దీన్ని యూఎస్బీ కేబుల్‌తో కనెక్ట్ చేసుకోవాలి.
ధర: 990 రూపాయలు
ఫ్లిప్స్టిక్ గ్రిప్
ఫ్యామిలీతో పిక్నిక్కు వెళ్లినప్పుడు ఎక్కువగా గ్రూప్ ఫొటోలు తీసుకుంటారు. ఫ్యామీలీ అంతా ఫ్రేమ్‌లో రావాలంటే బయటి వాళ్లను రిక్వెస్ట్ చేయాలి. కానీ... ఈ టూల్ మీ దగ్గర ఉంటే ఆ అవసరం ఉండదు. ఫ్లిప్స్టిక్ అనే కంపెనీ తెచ్చిన ఈ టూల్‌ని ఫోన్ కేస్కి అతికించాలంతే. ఫ్లిప్స్టిక్కు ఉండే గ్రిప్ వల్ల దీన్ని ఎక్కడైనా ఈజీగా స్టిక్ చేయొచ్చు. చెట్టుకో, స్తంభానికో స్టిక్ చేసి, ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. దీనికి గ్లూ ఉంటుంది. అందుకని ఎక్కడైనా అతికించడం ఈజీ. ఒక ఫ్లిప్స్టిక్ను వెయ్యి కంటే ఎక్కువ సార్లు స్టిక్ చేయొచ్చు.
ధర: సుమారు 700 రూపాయలు