టూల్స్ గాడ్జెట్స్ : దోమలను తరిమే లైట్‌‌

టూల్స్ గాడ్జెట్స్ :  దోమలను తరిమే లైట్‌‌

ఇంట్లో నుంచి దోమలను తరిమేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది ఇంట్లో మస్కిటో కాయిల్స్‌‌ కాలుస్తుంటారు. వాటివల్ల ఇంట్లో పొగ నిండిపోయి, ఘాటు వాసన వచ్చి ఊపిరి ఆడనట్టు ఉంటుంది అంటారు కొందరు. అలాంటివాళ్లు ఈ సర్కిల్‌‌ లైట్‌‌ని ఇంట్లో పెట్టుకుంటే సరి. దీన్నుంచి వచ్చే సౌండ్‌‌ వల్ల దోమలు, పురుగులు, ఎలుకలు, సాలెపురుగులు, చీమలు, బొద్దింకలు, ఈగలు పారిపోతాయి.

ఎందుకంటే.. వాటిని తిప్పికొట్టే ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో ఇది సౌండ్‌‌ చేస్తుంది. ఆ సౌండ్‌‌ చాలా చిన్నగా వస్తుంది కాబట్టి నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగదు. దీనికి ఉండే లైట్‌‌ బెడ్‌‌ ల్యాంప్‌‌గా ఉపయోగపడుతుంది. దీన్ని పవర్‌‌‌‌ సాకెట్‌‌లో పెట్టి బటన్‌‌ నొక్కితే చాలు. ఇన్‌‌స్టలేషన్ అవసరం లేదు. 

ధర : 299 రూపాయలు 

శివుడికి అభిషేకం 

శివలింగం మీద పొగ పడుతుంటే.. జలధార పడుతున్నట్టు ఉన్న ఈ ధూప్‌‌‌‌ కోన్‌‌ హోల్డర్‌‌‌‌ని ‘ఎలిస్‌‌బర్రీ’ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇందులో కింది భాగంలో శివలింగం ఉంటుంది. పై భాగంలో ధూప్‌‌ కోన్ బర్నర్ ఉంటుంది. అందులో ధూప్ కోన్‌‌ పెట్టి నిప్పు అంటించాలి. ధూప్‌‌ కోన్‌‌ నుంచి వచ్చే పొగ శివుడిని అభిషేకించినట్టు ధారగా పడుతుంది.

మెడిటేషన్‌‌ చేసేటప్పుడు, స్ట్రెస్‌‌ ఫీల్ అయినప్పుడు ఇందులో ధూప్ కోన్‌‌ని వెలిగిస్తే.. రిలాక్సింగ్​గా ఉంటుంది. దీనివల్ల స్లీప్‌‌ క్వాలిటీ కూడా పెరుగుతుంది! ఈ కోన్‌‌ హోల్డర్‌‌ను లివింగ్ రూమ్, బెడ్‌‌రూమ్, స్టడీ, ఆఫీస్, మెడిటేషన్, యోగ రూమ్, హోటల్స్​లో ... ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ధూప్‌‌ కోన్‌‌ని అంటించాక బ్యాక్‌‌ ఫ్లో మొదలవ్వడానికి 50 నుంచి 60 సెకన్లు పడుతుంది. ఈ ప్యాకేజీలో హోల్డర్‌‌‌‌తోపాటు 50 ధూప్‌‌ కోన్స్‌‌ ఉంటాయి. 

ధర : 849 రూపాయలు 

మాప్ హోల్డర్‌‌‌‌ 

మాప్‌‌, చీపురు, బూజు కర్రలను ఇంట్లో ఓ మూలకు నిలబెడుతుంటారు. కానీ.. చాలాసార్లు అవి ఆగక పదే పదే కింద పడుతుంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఒకటికి పదిసార్లు వాటి దగ్గరకే వెళ్తుంటారు. అందుకే వాటిని ఈ హోల్డర్లకు తగిలిస్తే సగం టెన్షన్​ పోతుంది. వీటిని ‘వాల్పిన్’ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. వీటికి వెనుక భాగంలో ఉంటే స్టిక్కర్‌‌‌‌ని తీసేసి, గోడకు అతికిస్తే చాలా రోజులు మన్నికగా ఉంటాయి. తుప్పు పట్టవు. ఇల్లు, గ్యారేజ్, బాత్‌‌రూంలో ఎక్కడైనా ఈజీగా అతికించేయొచ్చు. నీళ్లు పడినా ఊడిపోవు. టైల్స్, మార్బుల్స్‌‌, సిరామిక్ టైల్స్, గ్లాస్‌‌, స్టెయిన్‌‌లెస్ స్టీల్, అద్దం.. ఇలా వేటిమీద అయినా స్టిక్‌‌ చేసుకోవచ్చు. 

ధర : 189 రూపాయలకు 3 హోల్డర్లు 

గెలాక్సీ ప్రొజెక్టర్‌‌‌‌

రాత్రి నక్షత్రాలను చూడాలంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలి. కానీ.. ఈ లైట్‌‌ ఇంట్లో ఉంటే బెడ్‌‌ రూమ్‌‌లో పడుకునే నక్షత్రాలను చూడొచ్చు. కాకపోతే.. అవి నిజమైన నక్షత్రాలు కాదు. ఈ లైట్‌‌ ఇచ్చే ప్రొజెక్షన్‌‌ స్టార్స్‌‌. రోబోలా కనిపించే ఈ ప్రొజెక్టర్‌‌‌‌లోని ఫిల్మ్‌‌... నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని స్పష్టంగా ప్రొజెక్ట్‌‌ చేస్తుంది. దీని తలను 90 డిగ్రీలు, చేతులు 360 డిగ్రీల వరకు అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. ‘న్వైర్వాణ డెలివరింగ్ స్మైల్స్‌‌’ తీసుకొచ్చిన స్కై ప్రొజెక్టర్‌‌‌‌లో లైట్‌‌ ప్యాటర్న్​ని కూడా మార్చుకోవచ్చు. దీన్ని రిమోట్ కంట్రోల్‌‌తో కూడా ఆపరేట్‌‌ చేయొచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుందట! నిరాశ, ఒత్తిడికి గురైనవాళ్లకు బాగా హెల్ప్‌‌ అవుతుంది. దీనికి ఆటో ఆఫ్ టైమర్ కూడా ఉంటుంది. 45,  90 నిమిషాలకు టైం సెట్‌‌ చేసుకోవచ్చు. యుఎస్​బితో ఛార్జింగ్​ చేసుకోవచ్చు.

ధర : 1,199 రూపాయలు