టూల్స్ గాడ్జెట్స్ : మినీ బ్లూటూత్‌‌‌‌ స్పీకర్

టూల్స్ గాడ్జెట్స్ : మినీ బ్లూటూత్‌‌‌‌ స్పీకర్

మినీ బ్లూటూత్‌‌‌‌ స్పీకర్

కారు డ్రైవ్‌‌‌‌ చేస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌ వస్తుంటాయి. అలాంటప్పుడు చాలామంది ఇయర్‌‌‌‌‌‌‌‌ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతుంటారు. కానీ.. అది చాలా ప్రమాదకరం. వెనుక నుంచి వచ్చే వెహికల్స్ హార్న్‌‌‌‌ వినిపించదు. కారుని పక్కకి ఆపి ఫోన్‌‌‌‌ మాట్లాడాలి. కానీ... అలా చేయడం అన్నిసార్లు కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి మినీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ని వాడితే సరిపోతుంది.

ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా దీంతో ఫోన్‌‌‌‌ మాట్లాడడం చాలా సులభం. పోర్టోనిక్స్‌‌‌‌ కంపెనీ తీసుకొచ్చిన ఈ మినీ స్పీకర్ చాలా చిన్నగా ఉంటుంది. చొక్కా కాలర్‌‌‌‌‌‌‌‌కి తగిలించుకుని వాడుకోవచ్చు. లేదంటే.. దీని వెనుకభాగంలో ఉండే మ్యాగ్నెట్స్‌‌‌‌తో షర్ట్‌‌‌‌కి క్లిప్ చేసుకోవచ్చు. ఇది కేవలం 67గ్రాముల బరువు ఉంటే ఇందులో 2వాట్స్‌‌‌‌ స్పీకర్ ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌‌‌‌తో వస్తుంది.

ముఖ్యంగా వాకింగ్‌‌‌‌, జాగింగ్‌‌‌‌ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లూటూత్‌‌‌‌ కనెక్టివిటీతో పనిచేస్తుంది. కాల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ చేయడానికి, వాల్యూమ్ పెంచడం, తగ్గించడం కోసం మూడు బటన్స్‌‌‌‌ కూడా ఉంటాయి. వీటి సాయంతో మ్యూజిక్‌‌‌‌ని ప్లే/పాజ్ చేసుకోవచ్చు.  దీనికి ఒకసారి ఫుల్‌‌‌‌ ఛార్జ్‌‌‌‌ చేస్తే.. పది గంటలపాటు పనిచేస్తుంది. 
ధర: 1,398 రూపాయలు 


టెన్స్ మసాజర్‌‌‌‌‌‌‌‌

బాడీ పెయిన్స్‌‌‌‌, మెడ, కాళ్ల నొప్పులని తగ్గించుకోవడానికి రకరకాల గాడ్జెట్స్‌‌‌‌ వాడుతుంటారు. అలా బోలెడు గాడ్జెట్స్​ కాకుండా ఈ ఒక్క గాడ్జెట్‌‌‌‌ ఉంటే చాలు... అన్ని రకాల నొప్పులకు మసాజ్‌‌‌‌ చేసుకోవచ్చు. ఈ మల్టీఫంక్షనల్ టెన్స్ మసాజర్‌‌‌‌‌‌‌‌ని అగారో అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది. ఆర్థరైటిస్, పీరియడ్స్ పెయిన్, మోకాలి నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, మల్టిపుల్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌‌‌‌ వల్ల వచ్చే కండరాల నొప్పుల నుంచి దీన్ని వాడి ఉపశమనం పొందొచ్చు.

ఇందులో 24 ప్రి–ప్రోగ్రామ్ చేసిన మసాజ్ మోడ్‌‌‌‌లు ఉంటాయి. పాకెట్ సైజులో ఉండే ఈ మసాజర్‌‌‌‌‌‌‌‌ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ ప్యాక్‌‌‌‌లో 13 కండక్టబుల్‌‌‌‌ రీయూజబుల్‌‌‌‌ ప్యాడ్స్ కూడా వస్తాయి. వాటిని నొప్పి ఉన్నచోట తగిలించుకుని మెషిన్‌‌‌‌ని ఆన్‌‌‌‌ చేస్తే చాలు. ఇందులో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్​గా ఛార్జ్‌‌‌‌ చేస్తే.. నాలుగు నుంచి ఎనిమిది గంటలు పనిచేస్తుంది. 


డీవీడీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌

ఇప్పుడంటే అందరూ యూఎస్‌‌‌‌బీ డ్రైవ్‌‌‌‌లు వాడుతున్నారు. కానీ.. ఒకప్పుడు డీవీడీ, వీసీడీలదే హవా. అప్పట్లో చాలామంది పెండ్లిళ్లు, ఫంక్షన్ల వీడియోలు కూడా డీవీడీల్లోనే సేవ్ చేసుకునేవాళ్లు. కానీ.. టెక్నాలజీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ కావడంతో డీవీడీ డ్రైవ్‌‌‌‌లను వాడడం పూర్తిగా మానేశారు. మరి పాత డీవీడీల్లోని డాటాని చూడడం, కాపీ చేసుకోవడం ఎలా? అందుకోసం ఇప్పుడు మార్కెట్‌‌‌‌లోకి రకరకాల మినీ ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ డీవీడీ ప్లేయర్లు వచ్చాయి.

వాటిని ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, పీసీకి కనెక్ట్‌‌‌‌ చేసి ప్లే చేసుకోవచ్చు. ‘లారెన్‌‌‌‌సోరీ’ కంపెనీ తెచ్చిన ఈ డీవీడీ రైటర్/ ప్లేయర్/ రీడర్/ రిప్పర్‌‌‌‌‌‌‌‌ కాంపాక్ట్‌‌‌‌ సైజులో ఉంటుంది. దీంతో డీవీడీ, సీడీల్లో ఉండే డాటాని హార్ట్‌‌‌‌ డిస్క్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌డీల్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది యాపిల్‌‌‌‌ మ్యాక్ ఓఎస్‌‌‌‌తోపాటు విండోస్‌‌‌‌కి కూడా సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ఒకప్పడు గేమ్స్‌‌‌‌, ప్రోగ్రామ్స్‌‌‌‌ కూడా డీవీడీల్లోనే వచ్చేవి. అలాంటివాటిని కూడా కాపీ చేసుకొని, ఇన్‌‌‌‌స్టాల్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా పవర్ కార్డ్‌‌‌‌ ఉండదు. యూఎస్‌‌‌‌బీ లేదా టైప్​–సి ద్వారా కనెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. 
ధర : 1,641 రూపాయలు 

గేమింగ్ మౌస్‌‌‌‌ ప్యాడ్‌‌‌‌

ఇది మామూలు మౌస్‌‌‌‌ ప్యాడ్ కాదు. సెల్‌‌‌‌ఫోన్స్​ ఛార్జింగ్‌‌‌‌ చేసే వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ ఛార్జింగ్ మౌస్‌‌‌‌ ప్యాడ్‌‌‌‌. దీన్ని ఆర్చర్‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది15 వాట్స్‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ ఛార్జర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. అండర్ వోల్టేజ్, ఓవర్ వోల్టేజ్, హై టెంపరేచర్ నుంచి సర్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది. పైగా ఇది చాలా కాంపాక్ట్‌‌‌‌ సైజులో ఉంటుంది. దీన్ని ఛార్జర్‌‌‌‌‌‌‌‌ లేదా ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌/ పీసీ యూఎస్‌‌‌‌బీ పోర్ట్‌‌‌‌కి కనెక్ట్‌‌‌‌ చేయాలి. దీని పైభాగంలో మౌస్ తేలికగా కదిలేందుకు మెత్తని పీయూ ఫోమ్ మెటీరియల్ ఉంటుంది. దీని మరో ప్రత్యేకత.. శామ్‌‌‌‌సంగ్ ఎస్‌‌‌‌ పెన్‌‌‌‌ని కూడా ఛార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. 
ధర : 799 రూపాయలు