వాటర్ ఫ్రూఫ్ హోల్డర్
తెలియని ప్లేస్‌కి వెళ్లాలంటే.. అందరూ ముందుగా గూగుల్‌నే దారి అడుగుతుంటారు. ఎంత దూరమైనా గూగుల్ మ్యాప్స్ చూస్తూ వెళ్లిపోతుంటారు. మ్యాప్స్ చూసేందుకే బైక్స్ మీద వెళ్లేవాళ్లు ప్రత్యేకంగా మొబైల్ హోల్డర్లు పెట్టించుకుంటున్నారు. ఏర్పాటు అయితే బాగానే ఉంది కానీ వర్షాకాలంలోనే ఇబ్బంది. అలాంటప్పుడు వాటర్ ఫ్రూఫ్ హోల్డర్‌ని వాడాలి. దీన్ని సౌన్స్ స్టోర్ అనే కంపెనీ మార్కెట్‌లో అమ్ముతోంది. ఈ హోల్డర్‌లో ఫోన్ పెట్టి వర్షంలో కూడా మ్యాప్స్ చూడొచ్చు. చుక్క నీరు కూడా లోపలికి పోదు.
ఇందులో 4.7 అంగుళాల నుంచి 7.2 అంగుళాల స్క్రీన్ ఉన్న ఏ ఫోన్ అయినా పెట్టొచ్చు. 15 మి.మీ. మందం ఉన్న ఫోన్లు కూడా ఇందులో చక్కగా ఇముడుతాయి. దీని పైభాగంలో ఉండే గ్లాస్‌ని సెన్సిటివ్ టీపీయూ మెటీరియల్‌తో తయారుచేశారు. కాబట్టి టచ్ స్క్రీన్ సెన్సివిటీ బాగుంటుంది. డిస్‌ప్లే కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 360 డిగ్రీల వరకు రొటేట్ అవుతుంది. దీన్ని హ్యాండిల్‌బార్‌కి బిగించడం చాలా ఈజీ. ఇ–-బైక్, మోటార్ సైకిల్, షాపింగ్ కార్ట్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఇలా దేనికైనా బిగించుకోవచ్చు.
ధర : 399 రూపాయలు
మిర్రర్ ఫిల్మ్
కారు నడిపేటప్పుడు వెనక నుంచి వస్తున్న వెహికల్స్ చూసేందుకు సైడ్ మిర్రర్స్ వాడుతుంటారు. కానీ.. వాన కురుస్తున్నప్పుడు వెనకనుంచి వస్తున్న వెహికల్స్ సరిగా కనిపించవు. వర్షపు చుక్కలు అద్దం మీద నిలిచిపోవడం వల్ల లైట్ రిఫ్లెక్షన్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు కారు ఆపి, అద్దాలను క్లీన్ చేయాలి. ప్రతిసారీ అలా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ ఫిల్మ్‌ని మిర్రర్స్కి అతికించాలి. బొవీమాల్ అనే కంపెనీ ఈ ఫిల్మ్స్‌ని పీఈటీ మెటీరియల్‌తో తయారు చేసింది.
ఫిల్మ్‌కి నానో–కోటింగ్ ఉంది. అందుకే వీటి మీద పడే నీటి బిందువులు తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతాయి. అంతేకాదు.. స్ట్రాంగ్ లైట్ రిఫ్లెక్షన్‌ని కూడా తగ్గిస్తుంది. ఇవి యాంటీ ఫాగ్, యాంటీ గ్లేర్, యాంటీ స్క్రాచ్, వాటర్‌ప్రూఫ్, రెయిన్‌ప్రూఫ్‌గా పనిచేస్తాయి. ఈ ప్యాకేజీలో రెండు కార్ రియర్‌వ్యూ మిర్రర్ ఫిల్మ్స్లతోపాటు ఆల్కహాల్ బ్యాగ్స్, మిర్రర్ క్లీనింగ్ క్లాత్ కూడా వస్తాయి. కార్లతోపాటు, బస్, ఆఫ్–రోడ్ వెహికల్, ట్యాక్సీ, ట్రక్స్, ట్రైలర్లు లాంటి అన్నింటికీ వేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ.
ధర : 164 రూపాయలు
పూప్ స్కూపర్
కుక్కల్ని పెంచుకునే వాళ్లంతా వాటిని రెగ్యులర్‌గా వాకింగ్‌కి తీసుకెళ్తుంటారు. కానీ.. అవి ఎక్కడ పడితే మల విసర్జన చేస్తుంటాయి. దాన్ని అలాగే వదిలేస్తే.. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. కాబట్టి.. వాకింగ్‌కి వెళ్లిన ప్రతిసారి ఇలాంటి పూప్ స్కూపర్‌ని తీసుకెళ్తే సరిపోతుంది. దీంతో మలాన్ని ఈజీగా తీసెయొచ్చు. దీన్ని అమెజాన్ బేసిక్స్ కంపెనీ మార్కెట్‌లో అమ్ముతోంది.
దీనికి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్‌ని స్క్వీజ్ చేస్తే.. కింది భాగంలో ఉండే జాస్ తెరుచుకుంటాయి. హ్యాండిల్‌ని రిలీజ్ చేయగానే మూసుకుంటాయి. సింపుల్ స్ప్రింగ్ కంట్రోల్డ్ మెకానిజంతో పనిచేస్తుంది ఇది.
ధర : 299 రూపాయలు
వాషర్ కప్
పెంపుడు కుక్కలు ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో బయట ఉన్న బురద అంతా కాళ్లకు అంటించుకుని లోపలికి వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ వాషర్ కప్ ఉంటే ఈజీగా క్లీన్ చేయొచ్చు. దీన్ని ఫుడీ పప్పీస్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ వాషింగ్ కప్ లోపల కుక్క కాలు పెట్టి అటూ.. ఇటూ.. తిప్పాలి. దీన్ని హై క్వాలిటీ మెటీరియల్‌తో తయారుచేశారు.
దీని లోపల ముళ్ల లాంటి మెత్తని సిలికాన్ పుల్లలు ఉంటాయి. కుక్క కాలు, పాదానికి అంటుకున్న దుమ్ము, మట్టిని తొలగిస్తాయి. దీని బ్రిస్టల్ బ్రష్ ప్యాడ్‌ని హై క్వాలిటీ నాన్–స్టిక్, నాన్–స్టెయినింగ్ హై క్వాలిటీ సిలికాన్‌తో తయారుచేశారు. స్ట్రాంగ్‌గా ఉండే హై గ్రేడ్ ప్లాస్టిక్‌తో ఈ కప్ తయారుచేశారు.
ధర : 289 రూపాయలు