Healthy Breakfast: ఈజీగా తక్కువ టైంలో శాండ్​విచ్​ తయారు చేసుకోవచ్చు

 Healthy Breakfast: ఈజీగా తక్కువ టైంలో శాండ్​విచ్​ తయారు చేసుకోవచ్చు

ఈజీగా చేసుకోదగిన హెల్దీ బ్రేక్​ఫాస్ట్‌‌‌‌ శాండ్​విచ్​. అందుకే ఈమధ్య ఎక్కువమంది తింటున్నారు. వెళ్లిన ప్రతిచోటా ఇలాంటి బ్రేక్​ఫాస్ట్‌ దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఈ పోర్టబుల్​ శాండ్​విచ్​ మేకర్​ని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. మార్కెట్​లో చాలా కంపెనీలు ఇలాంటివి తయారుచేస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నదాన్ని అమెజాన్​ బేసిక్స్ తీసుకొచ్చింది. ఇది 800 వాట్​ కెపాసిటీతో వస్తుంది. దీనివల్ల ​ చాలా తక్కువ టైంలో ఫర్​ఫెక్ట్‌‌‌‌గా శాండ్​విచ్ చేసుకోవచ్చు. 

ఇది ఇంటెలిజెంట్​ టెంపరేచర్​ కంట్రోల్​తో వస్తుంది. అంటే ఓవర్​ హీట్​ అయిన వెంటనే ఆఫ్​ అయిపోతుంది. వేడి తగ్గిన తర్వాత మళ్లీ ఆటోమెటిక్​గా ఆన్ అవుతుంది. దీనికి ఎల్​ఈడీ ఇండికేటర్​ కూడా ఉంటుంది. ఇది డ్యూరబుల్​ నాన్​స్టిక్​ కోటింగ్​తో వస్తుంది. తయారీలో డై–కాస్ట్ అల్యూ‌‌‌‌‌‌‌‌మినియం ప్లేట్స్​ని వాడారు. ఇవి చాలాకాలం మన్నికగా ఉండడంతోపాటు వీటిని ఈజీగా క్లీన్​ చేసుకోవచ్చు. ఇందులో శాండ్​విచ్​తోపాటు కబాబ్స్​ లాంటివి కూడా కుక్​ చేసుకోవచ్చు. ఇది కూల్​ టచ్​ హ్యాండిల్​తో రావడం వల్ల పట్టుకున్నప్పుడు చేయికి వేడి తగలదు. 

ధర: రూ. 1,099