H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..

H1B వీసా..అమెరికాలో ఉద్యోగాల కోసం ఆదేశం జారీ చేసే వీసా. ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రతి ఏటా అమెరికా లక్షల్లో వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసాల ద్వారా వివిధ దేశాలనుంచి స్కిల్డ్ గ్రాడ్యుయేట్లు అక్కడి వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటారు..అమెరికాలోని కంపెనీలతో పాటు, అక్కడి ఏర్పాటు చేసిన వివిధ దేశాలకు చెందిన కంపెనీలు కూడా ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి..  అలాంటి కంపెనీలు మన దేశానికి చెందిన టాప్ 10 కంపెనీలు ఏవో చూద్దాం.. 

అమెరికాలో ప్రస్తుతం స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్‌ హాట్ టాపిక్.. ముఖ్యంగా H-1B వీసాకు సంబంధించి జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు అమెరికాలో ఇదే ప్రధాన రాజకీయ సమస్య. మరికొద్ది రోజుల్లో అధికారం చేపట్టబోతున్న ట్రంప్ కూడా H1B వీసాలపై ఆంక్షల దిశగా ప్రకటనలు మరింత చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని దాదాపు 1436 శాతం మంది ఓటర్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ సమస్యనుచాలా సీరియస్ గా తీసుకున్నట్లు యూ గోవ్ పోల్ అనే సంస్థ అక్టోబర్ లో చేసిన సర్వేల్లో వెల్లడైంది. 

H-1B వీసాను యూఎస్ డిపార్డ్ మెంట్ ఆఫ్ లేబర్ జారీచేస్తుంది. స్పెషల్ స్కిల్స్ , కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉన్న విదేశాలకు చెందిన ఉద్యోగులను నియమించుకునేకుందుకు అమెరికాలోని కంపెనీలకు అనుమతి ఇస్తుంది. ఈ H-1B వీసాల ఎక్కువగా పొందిన దేశాల్లో ఇండియా మొదటిది. యూఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం.. 2015 నుంచి ఇప్పటివరకు అత్యధికంగా 70 శాతం వీసాలు భారతీయులకే  జారీ చేశారు. 

ALSO READ | అడ్వర్టైజర్లకు యూజర్ల డేటా ఇవ్వలే: యాపిల్

FY 2024లో టాప్ 10 H-1B వీసా హోల్డర్  ఇండియన్ కంపెనీలు 

అమెరికా మంజూరు చేసిన H-1B వీసాలు పొందిన కంపెనీలు ఇండియన్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి.. దాదాపు 20 శాతం వాటాను ఈ  కంపెనీలు పొందాయి. జారీ చేసిన లక్షా 30వేల  H-1B వీసాల్లో దాదాపు 26వేల 766 వీసాలను భారతీయ కంపెనీలకు కేటాయించారు. ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HCL టెక్నాలజీస్ వంటి ప్రముఖ భారతీయ IT సేవల కంపెనీలు H-1B వీసా హోల్డర్లుగా ఉన్నాయి.