ఇప్సాస్ సంస్థ భాగస్వామ్యంతో రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహాదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
టాప్–10లో ఉన్న నగరాలు: న్యూయార్క్(యూఎస్ఏ), పారిస్ (ఫ్రాన్స్), టోక్యో(జపాన్), సింగపూర్(సింగపూర్), రోమ్ (ఇటలీ), మాడ్రిడ్ (స్పెయిన్), బార్సిలోనా (స్పెయిన్), బెర్లిన్ (జర్మనీ), సిడ్నీ (ఆస్ట్రేలియా).
నివాస యోగ్యత, సంస్కృతి, నగరంలో రాత్రి జీవితం, శ్రామిక శక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం తదితర అంశాల ప్రాతిపదికన జాబితాను రూపొందించారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతం స్థాయిలో ముంబయి, ఢిల్లీ నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నా, ప్రపంచ స్థాయిలో మాత్రం ముంబయి, ఢిల్లీ నగరాలకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. కానీ ప్రపంచ స్థాయిలో ఈ నగరాలు టాప్–100 జాబితాలో కూడా లేవు.
ఈ నివేదికను మొదటిసారిగా 31 దేశాల్లోని 22,000 మందికి పైగా ప్రజల నుంచి అవగాహన ఆధారిత అభిప్రాయాలు సేకరించారు.