- లిస్టులో 185 మంది భారతీయులు
- వెల్లడించిన రిపోర్ట్
న్యూఢిల్లీ: అత్యధిక బిలియనీర్లు గల దేశాల లిస్టులో మనదేశం మూడోస్థానంలో ఉందని వెల్లడయింది. యూబీఎస్ తాజా బిలియనీర్ ఆంబిషన్స్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత సంవత్సరంలో 185 మంది బిలియనీర్లతో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది. యూఎస్ (835) చైనా (427) కంటే వెనుకబడి ఉంది. మనదేశంలో గత సంవత్సరంలో 32 మంది బిలియనీర్లుగా ఎదిగారు. వార్షికంగా ఈ సంఖ్య 21 శాతం పెరిగింది. 2015 నుంచి ఏకంగా 123 శాతం వృద్ధి కనిపించింది. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద సంవత్సరంలో 42.1 శాతం పెరిగి 905.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 2015లో 1,757 నుంచి ఈ ఏడాది 2,682కి పెరిగింది. వీళ్లందరి సంచిత సంపద 6.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. వార్షికంగా- 121 శాతం పెరుగుదల ఉంది. 2015 నుంచి 2020 వరకు బిలియనీర్ల సంపద ప్రపంచవ్యాప్తంగా 10 శాతం వార్షిక రేటుతో పెరిగింది. 2020 నుంచి ప్రపంచ సగటు ఒక శాతం వద్ద నిలిచిపోయింది. భారత్‌వంటి దేశాల్లో మాత్రం భారీగా పెరిగింది. ఇండియా ఆర్థికాభివృద్ధికి ఫ్యామిలీ బిజినెస్‌లు ఎంతో దోహదం చేశాయి. వ్యాపార కుటుంబాలకు చెందిన లిస్టెడ్ కంపెనీల సంఖ్య ఇండియాలోనే అత్యధికంగా ఉంది. ఇలాంటి కంపెనీల సంఖ్య 108కి చేరింది.
చైనాలో తగ్గుదల
ప్రస్తుత సంవత్సరం యూఎస్‌లో 84 మంది బిలియనీర్లు కాగా, చైనాలో ఈ సంఖ్య 93 తగ్గింది. అమెరికన్ బిలియనీర్ల సామూహిక సంపద 4.6 ట్రిలియన్ డాలర్ల నుంచి 5.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే చైనా మొత్తం సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది 2,682 మంది బిలియనీర్లలో 1,877 మంది సొంతంగా ఎదిగినవాళ్లు కాగా, 805 మంది వారసత్వ సంపద కారణంగా సంపన్నులు అయ్యారు. వచ్చే దశాబ్దంలో భారత్ నుంచి బిలియనీర్ఎంట్రప్రెన్యూర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. గత దశాబ్దంలో టెక్ బిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా సంపదను పెంచుకున్నారు. వీరి మొత్తం సంపద 2015లో 788.9 బిలియన్ డాలర్లు ఉంటే 2024లో 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
ALSO READ | Indias Forex Reserves:8వారాల తర్వాత.. పెరిగిన భారత విదేశీ మారకం నిల్వలు