దేవర (Devara) సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీ.. వినీ ఎరుగని రేంజ్ లో ఉంది. కేవలం తెలుగు స్టేట్స్ లోనే దాదాపు రూ.115 కోట్ల బిజినెస్ దేవర సినిమాకు జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నైజాం ఏరియాలో కనీసం రూ.45 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లు అని సమాచారం.
ఇకపోతే ఓవర్సీస్ లోను దేవర లెక్కలు భారీగానే ఉన్నాయి. యూఎస్‌లో రూ.26 కోట్లు, మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తే దేవర బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్టు అని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలంటే సహజంగానే భారీగా బిజినెస్ జరుగుతోంది. ఇక అందులోను ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో అంటే ఇక ఈ మాత్రం అయిన ఉండాల్సిందే. అయితే, ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా అత్యధిక బిజినెస్ చేసిన తెలుగు హీరోల సినిమాల జాబితా చూసుకుంటే చాలానే ఉన్నాయి, అందులో ఎన్టీఆర్ దేవర మూవీ ఏ స్థానంలో ఉందో ఓ సారి లుక్కేద్దాం.
ALSO READ : DevaraJatharaaBegins: దేవర '1 am' షోలు ఈ 29 థియేటర్లలోనే.. అవేంటో ఓ లుక్కేయండి
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.480+ కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ సినిమాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలాగే ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉంది. ఏకంగా రూ.380 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రెండో స్థానం సొంతం చేసుకుంది.
ప్రభాస్ ‘సలార్’ రూ.350 కోట్లు టాప్ 3లో నిలిచింది.
ప్రభాస్ ‘బాహుబలి 2’ ఇక రూ.350 కోట్లు టాప్ 4
ప్రభాస్ ‘సాహో’ మూవీ రూ.290 కోట్లు టాప్ 5
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాపై రూ.250 కోట్లు టాప్ 6
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాపైనే రూ.205 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది టాప్ 7లో ఉంది.
అయితే.. ఇక్కడ ఇది గమనించారా.. వరల్డ్ వైడ్గా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల జాబితాలో టాప్ 2 నుంచి టాప్ 7 వరకు ప్రభాస్ సినిమాలే ఉండటం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ రూ.200 కోట్లతో టాప్ 8
సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే ఎన్టీఆర్ ‘దేవర’ రూ.180 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ మూవీ టాప్ 9లో ఉండడం గమనార్హం. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రూ.150 కోట్లతో టాప్ 10లో నిలిచింది. అయితే, పుష్ప 2 మూవీ కూడా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్టు సంచారం.