Stocks to Buy: దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు10 పవర్‌ఫుల్ స్టాక్స్.. అనలిస్టులు ఇచ్చిన లిస్ట్ ఇదే..

Stocks to Buy: దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు10 పవర్‌ఫుల్ స్టాక్స్.. అనలిస్టులు ఇచ్చిన లిస్ట్ ఇదే..

Stock Recommendations: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ల అనిశ్చితుల కారణంగా భారీగా ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా మంది మార్కెట్ల పతనాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లో మంచి భవిష్యత్తు కలిగిన కంపెనీల షేర్లను ముందు చూపుతో బై ఇన్ డిప్స్ స్ట్రాటజీ కింద కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ బ్రోకరేజీలకు చెందిన నిపుణులు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగిన ఇన్వెస్టర్లకు10 షేర్లను సూచిస్తున్నారు. 

ఈ క్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థలైన మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, షేర్ ఖాన్, యాక్సిస్ సెక్యూరిటీస్ వంటి సంస్థలు పవర్, రియల్టీ, ఐటీ సహా మరిన్ని రంగాలకు చెందిన 10 బెస్ట్ షేర్లను ఇన్వెస్టర్ల కోసం ఎంపిక చేశాయి. 

1. టాటా కన్సల్టెన్సీ కంపెనీ షేర్లకు రూ.3వేల 850 టార్గెట్ ధరను మోతీలాల్ ఓస్వాల్ ప్రకటించింది. ఇదే క్రమంలో కేఆర్ చోక్సీ ఐటీ దిగ్గజం షేర్లకు రూ.4వేల 144 టార్గెట్ ధరగా ప్రకటించింది.

2. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందిస్తూ స్టాక్ టార్గెట్ ధరను రూ.5వేల 100గా ప్రకటించింది.

3. దేశీయ బ్రోకరేజ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ టాటా స్టీల్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.180గా ప్రకటించింది.

4. ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ కొనుగోలు రేటింగ్ అందిస్టూ టార్గెట్ ధరను రూ.950గా ఫిక్స్ చేసింది.

5. రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో ఒకటైన గోద్రేజ్ ప్రాపర్టీ షేర్లకు బై రేటింగ్ అందించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ టార్గెట్ ధరను రూ.2వేల 515గా ప్రకటించింది.

6. దేశీయ బ్రోకరేజ్ షేర్ ఖాన్ అఫ్లీ ఇండియా షేర్లను కొనుగోలుకు సూచిస్తూ టార్గెట్ ధరను రూ.వెయ్యి 880గా దీర్ఘకాలిక వ్యూహంతో ప్రకటించింది.

7. బ్యాంకింగ్ దిగ్గజ బ్రోకర్ యాక్సిస్ సెక్యూరిటీస్ ఆటో రంగానికి చెందిన యూనో మిండా షేర్లకు కొనుగోలు రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.900గా ఫిక్స్ చేసింది.

8. ఇదే క్రమంలో కేఈసీ ఇంటర్నేషనల్ షేర్లకు టార్గెట్ ధరను రూ.742గా యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకటించింది.

9. పవర్ రంగానికి చెందిన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ షేర్లకు యాక్సిస్ సెక్యూరిటీస్ రూ.530గా టార్గెట్ ధరను ఫిక్స్ చేసింది. 

10. ఇక చివరిగా దేశీయ బ్రోకరేజ్ ఎంకే గ్లోబల్ డెలివరీ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.400 వద్ద ప్రకటిస్తూ కొనుగోలు చేయాలని సూచించింది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.