Malayalam Thrillers OTT: ఓటీటీల్లోకి రానున్న టాప్ 3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Malayalam Thrillers OTT: ఓటీటీల్లోకి రానున్న టాప్ 3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

కొన్ని సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. కొంతమంది ఆడియన్స్ కి సినిమాల్లో కథ, క్రైమ్ ఉంటే చాలు. ఎంచక్కా ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ లేటెస్ట్ మలయాళ సినిమాలు. ఇటీవలే, థియేటర్లో రిలీజైన టాప్ 3 సినిమాలు ఇపుడు ఓటీటీకి వచ్చేస్తోన్నాయి.

అయితే, ప్రస్తుతం మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు వీపరీతంగా నచ్చేస్తున్నాయి. అక్కడీ మేకర్స్ తీసే సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మలయాళ దర్శకులు రాసుకునే కథల్లో సహజత్వం, లొకేషన్స్, నటి నటుల పెర్ఫార్మన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. దీంతో మలయాళ భాష నుంచి సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం షురూ చేస్తారు.

ఇంకా చెప్పాలంటే తెలుగులో ఎక్కువ మంది పర్టికులర్గా క్రైమ్, థ్రిల్లర్ జోనర్ సినిమాలకు ఆడిక్ట్ అయిపోయారంటే నమ్మరు సుమా! ఇప్పుడు అలాంటి సినిమాలే ఓటీటీకి వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

1. రేఖాచిత్రం:

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిందే ఈ రేఖాచిత్రం. ఈ మూవీని జోఫిన్ టి. చాకో తెరకెక్కించాడు. ఇందులో ఆసిఫ్ అలీ మరియు అనశ్వర రాజన్ నటించారు. జాన్ మంత్రికల్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి మరియు ఆంటో జోసెఫ్ నిర్మించారు.ఇందులో జరీన్ షిహాబ్, మనోజ్ కె జయన్ ప్రముఖ పాత్రల్లోకనిపించారు.

జనవరి 9, 2025న రేఖాచిత్రం రిలీజై సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ మార్చి 7న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.55కోట్ల కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. ఇందులో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మరి తెలుగు ఆడియన్స్ కు ఎలాంటి ఫీల్ ఇవ్వనుందో చూడాలి. 

2. ఆఫీసర్ ఆన్ డ్యూటీ:

ఇటీవలే మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కుంచాకో బోబన్‌, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడీ ప్రేక్షకులను ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దాంతో ఈ నెల (మార్చి 7న) తెలుగు థియేటర్స్ లో కూడా రానుంది.

అయితే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్చి నెలలోనే నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాకు జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.40 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. 

కథేంటంటే:

హరిశంకర్ (హరి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. చంద్రబాబు (జగదీష్) ఇమిటేషన్ (న‌కిలీ) బంగారు గొలుసును తనఖా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అతనికి ఫిర్యాదు అందుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొ న్నాడు? ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? ఒక చిన్న నేరాన్ని దర్యాప్తు చేస్తూ ఆర్గనైజ్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైకో కిల్లర్స్‌ని ఎలా వెలికితీస్తాడనే అనేదే మిగతా సినిమా కథ. 

3. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్:

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ 2025 జనవరి 23న విడుదల అయింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు. మిస్టరీ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7న  స్ట్రీమింగ్ కానుంది. 

కథేంటంటే:

ఈ మూవీ డిటెక్టివ్‍గా మారిన ఓ చురుకైన మాజీ పోలీసు చుట్టూ తిరుగుతుంది. పోయిన ఓ పర్సు కోసం ఇన్వెస్టిగేట్ చేయడం చుట్టూ సాగే కథగా వాసుదేవ్ మీనన్ ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు. అయితే, పోయిన పర్సు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొన్ని కీలకమైన పాయింట్స్ సంపాదిస్తాడు. అందులో కొంత మంది హత్య గావింపబడడం, నందిత అనే డ్యాన్సర్ మిస్ అవ్వడం ఇలా ప్రతిదీ ఆసక్తిగా తెలుసుకుంటాడు. ఇక ఈ మిస్టరీల వెనుక ఉన్నదెవరు? చివరికి కేసు ఎలా సాల్వ్ చేశాడనేది మిగతా కథ.