Health alert: 30 ఏళ్లు దాటిన మహిళలు ఈ టెస్ట్​లు చేయించుకోవాల్సిందే..!

Health alert: 30 ఏళ్లు దాటిన మహిళలు ఈ టెస్ట్​లు చేయించుకోవాల్సిందే..!

మహిళ ఆరోగ్యంగా.. చలాకీగా ఉంటేనే ఆ ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  అయితే ప్రస్తుత రోజుల్లో మహిళలు ఇంట్లో..బయట పని చేస్తున్నారు.  దీంతో వారు చాలా అలసిపోయి మూడు పదుల వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి వాటికి  చెక్​ పెట్టేందుకు 30 ఏళ్లు రావడంతోనే మహిళలు అందరూ మూడు రకాలైన టెస్ట్​లు చేయించు కోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. . . .

మహిళల ఆరోగ్యం గురించి  ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో ..  సర్వే ప్రకారం ప్రతి  ముగ్గురిలో ఒకరు అంటే దాదాపు ఒక బిలియన్ మహిళలు శారీరక బాధతో  ఇబ్బంది పడుతున్నారని ఆ నివేదికల ద్వారా తెలుస్తుంది.  అలాగే ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు రోజువారీ కార్యకలాపాలు ( ఇంటి పనులు.. వంట పనులు) చేయడానికి వారి ఆరోగ్యం సహకరించడం లేదని తెలుస్తుంది.  అంటే దీనిని బట్టి పరిశీలిస్తే మహిళల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్దమవుతుంది. 

స్త్రీ అంటే ఆది పరాశక్తి అని పురాణాల్లో చదువుకోవడమే కాదు.. వారి ఆరోగ్యం పట్ట శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.  అందుకే ఎప్పటికప్పుడు మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేయించాలి. సాధారణంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఆరోగ్యపరంగా చాలా మార్పులు వస్తాయని పట్పర్‌గంజ్‌లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని మెడికల్ ఆంకాలజీ వైస్ చైర్మన్ డాక్టర్ మీను వాలియా తెలిపారు. అందుకే మూడు పదులు దాటిన ప్రతి మహిళ కూడా మూడు రకాల టెస్ట్స్​ చేయించుకోవాలని ఆయన సూచించారు.

ALSO READ : Holy 2025: హోలీ స్వీట్..​ బెంగాలీ గుజియా స్వీట్​ .. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా..!

పాప్ స్మియర్ ...  HPV పరీక్ష (గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్): సాధారణంగా మహిళలు గర్భాశయ కేన్సర్​ తో బాధపడుతుంటారు.  ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చకముందే గుర్తించి.. ట్రీట్​మెంట్​ తీసుకుంటే ఇబ్బంది ఉండదు.  దీనిని గుర్తించేందుకు పాప్ స్మియర్ ...  HPV పరీక్ష చేయించుకోవాలి.  దీని కేన్సర్​ కు కారణమయ్యే వైరస్​ వివరాలు తెలుస్తాయి. సాధారణంగా 21 సంవత్సరాల వయస్సులో ఈ వైరస్​ సోకే అవకాశం ఉంది.  ఇది చాలా నిదానంగా బయటపడుతుంది. అందే ప్రతి మహిళా కూడా మూడేళ్లకొకసారి ఈ టెస్ట్​ చేయించుకోవాలి. గర్భాశయ కేన్సర్​ ముదిరితే సమస్యలు తీవ్రతరం అవుతాయి. దీనిని ముందుగానే గుర్తించి ట్రీట్​ మెంట్​ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

రొమ్ము కేన్సర్​ టెస్ట్​:  సాధారణంగా మహిళల్లో మమోగ్రామ్​ 40 ఏళ్లకు మొదలవుతాయి.  కాని ఇప్పటి జనరేషన్​ లో 30 ఏళ్లకు మొదలయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రొమ్ము కేన్సర్​ ఏ వయస్సులో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించేందుకు MRI టెస్ట్​ చేయించుకోవాలి. ఈ వ్యాధిని గుర్తించేందుకు  MRI క్లినికల్ బ్రెస్ట్ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

బ్లడ్ షుగర్ ...  కొలెస్ట్రాల్ టెస్ట్​:  పూర్వ కాలంలో 60 ఏళ్ల పైబడిన  వారికి మధుమేహం ( షుగర్​).. గుండె జబ్బులు వచ్చేవి.  కాని ప్రస్తుతం బ్లడ్​ షుగర్​.. కొలెస్ట్రాల్ (గుండెకు సంబంధించి) ​ వంటి వ్యాధులకు వయస్సు నిమిత్తం లేకుండా ఎర్లీ ఏజ్​ లోనే వస్తున్నాయి.  ముఖ్యంగా ఊబకాయం,  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వంటి ప్రమాద కారకాలు ఉన్నవారిలో...   మధుమేహం లక్షణాలను గుర్తించడానికి ... ప్రతి మూడు నెలలకు  ఒకసారిబ్లడ్ షుగర్ టెస్ట్  ... అలాగే నాలుగు లేదా ఆరు నెలలకు  ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష (లిపిడ్ ప్రొఫైల్) టెస్ట్​ చేయించుకోవాలి.  రక్తంలో  కొలెస్ట్రాల్ ఉంటే .. గ్లూకోజ్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు..  స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ టెస్ట్​ లు చేయించుకోవాలి.