స్మార్ట్ ఫోన్.. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్న మనిషీ లేడు..నిత్యజీవితంలో ఫోన్ ఒక భాగమై పోయింది..ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడవదని అంటుంటుంటారు కొందరు. ఆన్ లైన్ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లకు యమగిరాకీ ఉంది. స్మార్ట్ ఫోన్లలో కూడా వేలనుంచి లక్షల దాకా ధరలు ఉన్నాయి. అయితే చాలా మంది తక్కువ ధరలో, తమ బడ్జెట్లో స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలని కోరుకుంటారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్సైట్లు అందించే ఆఫర్లకోసం ఎదురు చూస్తుంటారు.. అలాంటి వారికోసం తక్కువ బడ్జెట్ లో అంటే రూ.10వేల లోపు నాలుగు బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Redmi A4 5G
Redmi A4 5G తగ్గింపు ధర రూ. ధర రూ. 8,299. ఈ వేరియంట్ 4GB RAM , 64GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. 6.88-అంగుళాల డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది Snapdragon 4s Gen 2 SoC ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే..ఈ స్మార్ట్ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
Poco M6 5G
Poco M6 5G.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో లభించే బెస్ట్ డివైజ్.. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.ఈ డివైజ్ లో 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.74అంగుళా పెద్ద స్క్రీన్ తో డిస్ ప్లే ఉంటుంది. ఇది MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,5000mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. అన్ని ఆఫర్ల తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7వేల 749 లు మాత్రమే.
Redmi 13C 5G
మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 13C 5G..దీని ధర రూ. 8వేల999లు. 90Hz రీఫ్రెష్ రేటు, 6.6 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6100+ SoC ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.. బెస్ట్ ఫొటోలు, వీడియాలో తీసుకోవచ్చు. Redmi 13C 5G లో 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
Itel కలర్ ప్రో 5G
ఐటెల్ కలర్ ప్రో 5G డివైజ్ లో..4GB RAM,128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 8,999 లకు కొనుగోలు చేయొచ్చు. 6.6-అంగుళాల డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6080 SoC ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. పరికరం 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.