స్మార్ట్ ఫోన్..ఇది లేకుండా రోజు గడవదు..భారత్ లో సగానికి జనాభాకు పైగా సెల్ ఫోన్లు వాడుతున్నారట..ఈ స్మార్ట్ ఫోన్లను ఫీచర్స్ చూసి కొంటుంటారు..ముఖ్యంగా కెమెరా ఫీచర్లు.. ఇటీవల కాలంలో రీల్సీ చేయడం, సెల్ఫీలు, యూట్యూబ్ వీడియోలు చేయడం పరిపాటి అయిపోయింది..ఇలాంటి వాళ్లు కూడా ఫొటోలు, వీడియోల కోసం లేటెస్ట్ అప్డేట్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లను ఎంచుకుంటారు. మరీ బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు ఎంచుకోవడం ఎలా.. కెమెరా ఫోన్లలో ఏదీ బెటర్ అని చాలా మందికి సందేహాలుంటాయి.. అలాంటి వారి కోసం టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు.. వాటి ఫీచర్లు , ధరల గురించి తెలుసుకుందాం..
రియల్ మీ 13ప్రో +(Real me13Pro +)..
బెస్ట్ కెమెరా ఫీచర్లు స్మార్ట్ ఫోన్లలో రియల్ మీ 13 ప్రో + ఒకటి.. దీనిలో 50 మెగా పిక్సెల్ తో స్పోర్ట్స్ మెయిన్ కెమెరా ఉంటుంది.. అద్భుతంగా ఫొటోగ్రఫీ చేసుకోవచ్చు. ఫ్రంట్ లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంటుంది.. రీల్స్, సెల్ఫీలకు ఇది అద్బుతంగా ఉంటుంది.. లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. దీని ధర రూ.28వేల934 లకు అమెజాన్ ఈ కామర్స్ వెట్ సైట్ లో అందుబాటులో ఉంది.
హానర్ 200(Honor 200)
హానర్ 200 స్మార్ట్ ఫోన్ లో కూడా అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఇది అమెజాన్ లో కేవలం 26వేల999 లకు అందుబాటులో ఉంది. హానర్ 200 డివైజ్ లో మెయిన్ కెమెరా..50 మెగా పిక్సెల్ తో స్పెషల్ ఫొటోగ్రఫీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ కూడా 50మెగా పిక్సెల్ కెమరాను కలిగి ఉంది.. రీల్స్, సెల్ఫీలకు స్పెషల్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.
రెడ్ మీ ప్రో+(RedMe Pro +)..
రెడ్ మీ ప్రో+ స్మార్ట్ ఫోన్ ప్లిప్ కార్టులో 23వేల 485 లకు అందుబాటులో ఉంది.. ఇందులో కూడా లేటెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ డివైజ్ లో 200 MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ లో 16MP సెల్ఫీ షూటర్ కెమెరా ఉంది.
వన్ ప్లస్ నార్డ్ 4(One Plus Nord 4)..
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ లో కూడా బెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 27వేల 999.ఈ హ్యాండ్ సెట్ లో 50MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో బెస్ట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా 16MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో తో అద్బుతమైన సెల్ఫీలు, రీల్స్ చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50(Motorola Edge 50)..
Motorola Edge 50 ధర రూ. 27వేల 999 .. ఫ్లిప కార్టు లో అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ హ్యాండ్ సెట్ లో కూడా మెయిన్ కెమెరా 50 MP మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే.. 32MP మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీకి బెస్ట్ వన్ గా ఉంది.