కొన్నిసార్లు సింప్లిసిటీ చాలా ముఖ్యం.. ప్రత్యేకించి నగరాల్లోజీవిస్తున్నపుడు. సిటీలో నివసిస్తున్నపుడు ప్రత్యేకించి కార్ల గురించి మాట్లాడుతున్నపుడు..పార్కింగ్, చిన్న గల్లీలను, మెయిన్ రోడ్ల వరకు ఇబ్బందిలేకుండా ప్రయాణించే విధంగా కార్లు ఉంటే బాగుంటు అనుకుంటాం. నగరాల్లో సాధారణ కార్లు..పెద్ద సెడాన్లు లేదా ఎస్ యూవీలకంటే మెరుగ్గా ఉంటాయి అనిపిస్తుంది.. వాస్తవమే కదా పైగా బడ్జెట్ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో బడ్జెట్ కార్లకోసం చూస్తుంటారు చాలామంది మధ్యతరగతి జనం. అటువంటి వారికోసం బడ్జెట్ కార్లు అందుబాటులో ఉన్నాయి ..వాటి గురించి తెలుసుకుందాం..
మారుతి సుజుకీ ఆల్టో K10
ఆల్టో దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న అత్యంత సరసమైన కారు. ఈ చిన్న కారు చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఆఫ్ రోడింగ్ నుంచి హైవే రన్ ల వరకు స్పష్టంగా సిటీ ప్రయాణాలకు ఇది సరియైన కారు.దీని ధర రూ. 3.99(ఎక్స్ షోరూం). ఆల్టో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 66bhp శక్తిని అందిస్తుంది.
మారుతి సుజుకీ S-Ptresso
ఆల్టో మాదిరిగానే SUV ఇష్ ప్యాకేజీలో కారును కోరుకునే వారికి మారుతీ సుజుకీ S-Ptresso మంచి ఎంపిక. ఆల్టో అందించే అన్ని ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.దీని ధర రూ. 4.26 లక్షలు(ఎక్స్ షోరూమ్ ధర) S-Ptressoలో ఆల్టోK10మాదిరిగానే 66bhp పవర్ ను అందిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
బడ్జెట్ విషయంలో మారుతి సుజుకీ కంటే రెనాల్ట్ క్విడ్ బెస్ట వన్.. ఫ్రెంచ్ కార్ మేకర్ ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న కార్లలో ఇది ఉత్తమమైనది. ఆల్టోతో డైరెక్ట్ పోటీ పడుతున్న ఈ కారులో బోల్డ్ డిజైన్ కారణంగా ఎక్కువగా అమ్ముడవుతోంది. దీని ధర రూ. 4.69లక్షలు( ఎక్స్ షోరూమ్ ధర) , క్విడ్ 67bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తుంది.
మారుతీ సుజుకీ సెలెరియో
మారుతి సుజుకీ సెలెరియో ఇండియా మార్కెట్లో చాలా కాలంగా ఉన్న ప్రాడక్ట్. ఎప్పటికప్పుడు అప్డేట్ లతో ప్రస్తుతం మోడల్ సెలెరియో చాలా ఆకర్షించే వెర్షన్. ఇది ఆల్టో కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. మారుతి సుజుకీ సెలెరియో ధర రూ. 5.63లక్షలు( ఎక్స్ -షోరూం ), ఆల్టో, ఎస్ ప్రెస్సో మాదిరిగానే 66bhp శక్తి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.
మారుతి సుజుకీ ఈకో
మారుతి సుజుకీ ఈకో ధర రూ. 5.32 లక్షలు (ఎక్స్ షోరూమ్ ). ఎక్కువ స్థలంతో కూడిన యుటిలిటీ వ్యాన్ ఇది. అదనంగా 30వేల పెడితే ఏడుసీట్ల కెపాసిటీని పొందవచ్చు. మారుతీ సుజుకీ ఈకో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 80bhp శక్తిని ప్రొడ్యూజ్ చేస్తుంది.