![Best Cars : రూ.10 లక్షల్లో.. ఆరు ఎయిర్ బ్యాగ్స్ తో బెస్ట్ కార్లు ఇవే..!](https://static.v6velugu.com/uploads/2025/02/top-5-most-affordable-cars-with-in-6-airbags_FiP0JRbQ2j.jpg)
మంచి కారు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది.కొనుగోలు చేసే కారులో లేటెస్ట్ ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్ డిజైన్, తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లు ఉండాలని కోరుకుంటారు. అన్నింటికంటే ముందు సేఫ్టీ ఫీచర్ల గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సేఫ్టీ ఫీచర్లలో ఎయిర్ బ్యాగ్స్ చాలా ముఖ్యమైనవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీ కంపెనీలు ఆరు ఎయిర్ బ్యాగుల లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో తయారీ చేస్తున్నారు. ఈ ఆర్టికల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్న 5 బెస్ట్ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కార్లలో ఎయిర్‌బ్యాగులు ఎలా పనిచేస్తాయి..
ఎయిర్‌బ్యాగ్‌లు కెమికల్ రియాక్షన్స్, సెన్సార్లతో పనిచేస్తాయి. ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ లో క్రాష్ సెన్సార్లు, ఇన్‌ఫ్లేటర్, ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్ ,ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ప్రమాదంజరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి ఇవి కలిసి పనిచేస్తాయి. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీతో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్న 5 బెస్ట్ కార్లు ఇవే.
మారుతి సుజుకీ సెలెరియో..
ఈ హ్యాచ్ బ్యాక్ గతంలో రెండు ఎయిర్ బ్యాగులను మాత్రమే అందిచేది. డ్రైవర్, ముందు సీటులో కూర్చున్న మరొకరికి మాత్రమే ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉండేవి. ఆరు ఎయిర్ బ్యాగ్ లను అందిస్తున్న బ్యాండ్ వాగన్ లో తాజాది మారుతి సుజుకీ సెలెరియో.దీనికి అదనంగా 32వేల 500లు చెల్లించాల్సి ఉంటుంది. అదే CNGతో సహా సుజుకీ సెలోరియో VXI శ్రేణి ధర రూ. 16వేలు పెరిగింది. VMI AMT ధర రూ. 21వేలు అదనంగా చెల్లించాలి. ధర: రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్..
హ్యుందాయ్ కంపెనీ మోడల్ ద్వారా మొదటి సారి ఆరు ఎయిర్ బ్యాగులను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ మోడల్ లో మరొక సేఫ్టీ ఫీచర్ హిల్ అసిస్టెంట్ కంట్రోల్.దీంతో పాటు బ్యాక్ లో పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటాయి. ఈ హ్యాచ్ బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పెట్రోల్, CNG లో లభిస్తోంది. పెట్రోల్ ఇంజిన్ మోడల్ 6000 rpm వద్ద 82 bhp ,4000 rpm వద్ద 113.8 Nm అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMTకి జతచేయబడి ఉంటుంది. ఇక CNG లో 6000 rpm వద్ద 67.7 bhp ,4000 rpm వద్ద 95.2 Nmను ఉత్పత్తి చేస్తుంది.5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ధర: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.38 లక్షల వరకు ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్..
నిస్సాన్ మాగ్నైట్ ఆరు ఎయిర్‌బ్యాగులతోపాటు రిమైండర్ అలర్ట్‌లతో కూడిన మూడు-పాయింట్ సీట్ బెల్టులు, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది.. వీటితోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్లు సేఫ్టీ కిట్ లో ఉంటాయి. ఈ హ్యాచ్ బ్యాక్ 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ,1-లీటర్ టర్బో పవర్‌ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. - NA ఇంజిన్ 6250 rpm వద్ద 71 bhp ,3400 - 3600 rpm వద్ద 96 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టర్బో 5000 rpm వద్ద 98.6 bhp ,2800 నుంచి 3600 rpm వద్ద 160 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ధర: రూ. 6.12 లక్షల నుంచి రూ. 11.72 లక్షలు మధ్య ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.
హ్యుందాయ్ ఎక్స్టర్..
2023లో ఈ మోడల్ లాంచ్ చేశారు. ఆరంగ్రేటం చేసినప్పుడే అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. 2025లో కూడా అత్యధికంగా అమ్ముడైన టాప్ 20 కార్లలో ఇదొకటి. సేఫ్టీ సిస్టమ్ లో ఆరు ఎయిర్ బ్యాగులు ప్రధానమైనవి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX సీట్లు, వెనుక పార్కింగ్ కెమరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఉన్నాయి. ఇది గ్రాండ్ i10 నియోస్ మాదిరిగానే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సేమ్ అవుట్ పుట్, ట్రాన్స్ మిషన్స్ ఎంపికలు, CNG ట్రిమ్ శక్తితో లభిస్తోంది.ధర: రూ. 6 లక్షల నుంచి రూ. 9.48 లక్షలు
మారుతి సుజుకి స్విఫ్ట్..
ఇది స్పోర్టీ హ్యాచ్ బ్యాక్ లలో బెస్ట్ వన్. సేఫ్టీ సిస్టమ్ అద్బుతంగా ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్టెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, EBDతో ABS, ISOFIX సీట్లు ఉంటాయి. షోరూమ్ ధర: రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల వరకు ఉంటుంది.
కారు కొనుగోలు చేసేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది సేఫ్టీ ఫీచర్లు..ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్టెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కంఫర్టబుల్, అడ్జస్టబుల్ సీట్లను కార్ల కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్లతో అందిస్తున్నాయి. లెటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతోపాటు వీటికి ప్రాధాన్యత ఇస్తే జెర్నీ సేఫ్ గా, కంఫర్టబుల్ గా ఉంటుంది.