పాలిష్ చేసిన బియ్యం కన్నా.. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) బెటర్ అంటున్నారు డాక్టర్లు. ఈ రైస్ తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21 శాతం మెగ్నీషియం దొరుకుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవాహికలో క్యాన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. ఉబ్బసం తీవ్రతను బ్రౌన్ రైస్ తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
Also Read :- ఆరో రోజు పాశురం.. గోపికను నిద్ర లేపటానికి వెళ్లిన వాళ్లకు..!
వీటిలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ. థయామిన్, రైబోఫ్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు ఉంటాయి. ఇవి నరాలకు శక్తినిస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం కూడా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వయసు మళ్లిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ లాంటివి తినడం వల్ల ఎంటరోల్యాక్టోన్ స్థాయి పెరుగుతుందని తెలిసింది.
== V6 వెలుగు లైఫ్