ఆటో ఎక్స్ పో 2025 స్టార్టయ్యి.. కొత్త కొత్త కార్లను.. నెక్స్ట్ జనరేషన్ థీమ్స్ ను పరిచయం చేస్తోంది. న్యూ ఢిల్లీలో జరుగుతున్న కార్ల ఎక్సిబిషన్ (Auto Expo 2025) సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో సెకండ్ ఎడిషన్ ప్రపంచ వ్యాప్తంగా బజ్ క్రియేట్ చేస్తోంది. కొన్ని వింటేజ్ కార్ల లేటెస్ట్ డిజైన్స్, కొన్ని నెక్స్ట్ జనరేషన్ థీమ్స్, ఎలక్ట్రిక్ మోడల్స్, నెక్స్ట్ జనరేషన్ బైక్స్.. ఇలా అద్దిరిపోయే లుక్స్, ఫీచర్స్ తో ఆకట్టుకుంటోంది. ఆటో ఎక్స్ పో 2025 లో మోస్ట్ అట్రాక్టివ్ థీమ్స్.. వెహికిల్స్ ఏమేమున్నాయో ఓ లుక్కేద్దాం.
మారుతీ ఇ విటారా (Maruti e Vitara ) ఎలక్ట్రిక్:
మారుతీ ఇ విటారాతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రొడక్షన్ ప్రారంభించింది మారుతీ సుజుకీ కంపెనీ. ఫుల్ చార్జింగ్ పెడితే 500 కి.మీ. రేంజ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.
న్యూ లుక్ తో టాటా సియెర్రా(Tata Sierra )మళ్లీ వచ్చేసింది:
ఇండియా వాహనప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి టాటా సియెర్రా అద్దిరిపోయే లుక్స్ అండ్ ఫీచర్స్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. మోస్ట్ టాక్డ్ వెహికిల్ గా నిలించింది.
టాటా హారియర్ ఈవీ వచ్చేసింది:
ఎస్ యూవీ వెహికల్ టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV) వర్షన్ వచ్చేసింది. ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ ఫుల్ వెహికిల్ గా నిలిచిన ఈవీ రావడంతో మస్తు డిమాండ్ ఉంటుందని అంటున్నారు.
మోస్ట్ ఎవోల్వ్‌డ్ ఫామ్‌లో టాటా అవిన్యా (Tata Avinya):
ఆటో ఎక్స్ పోలో అత్యధికంగా ఆకట్టుకున్న మోడల్ టాటా అవిన్యా. ఫ్యూచర్ ఎడిషన్ గా ఎల్ఈడీ లైటింగ్ తో స్మార్ట్ లుక్ లో చాలా అట్రాక్టింగ్ వన్ గా నిలిచింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ బీఈవీ (Toyota Urban Cruiser BEV):
మారుతీ ఈ విటారా కు ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్‌తో ఉండే ఈ మోడల్.. డిఫరెంట్ లుక్స్ తో ఇండియాలోకి లాంచ్ కాబోతోంది.
హుందయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric):
మిడిల్ క్లాస్ కస్టమర్స్ కు ఎంతో రీచ్ అయిన క్రెటా ఎలక్ట్రిక్ వర్షన్ లాంచ్ చేసింది హుందయ్ కంపెనీ. ఈ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ రూ.18 లక్షలుగా ఉండనుంది. రేంజ్ 473 కి.మీ ఉంటుందని కంపెనీ అనౌన్స్ చేసింది.
ఎంజీ సైబర్‌స్టార్, ఎం9 ( Cyberster and M9):
ఎంజీ ఎలక్ట్రిక్ మార్కెట్ క్యాప్చర్ చేసే ప్లాన్ లో లేటెస్ట్ ఎంజీ సైబర్‌స్టార్, ఎం9 మోడల్స్ ను రిలీజ్ చేసింది.
కియా ఈవీ6 ఫేస్ లిఫ్ట్, క్యార్నివల్ హై లిమోసైన్ (Kia EV6 Facelift And Carnival Hi Limousine):
కొరియన్ ఆటో మేకర్ కియా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. హై లిమోసైన్ వేరియెంట్ గ్లోబల్ గా ఇకనుంచి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
బియండబ్ల్యూ ఎల్‌డబ్ల్యూబి (BMW iX1 LWB):
బియండబ్ల్యూ లేటెస్ట్ వర్షన్ BMW iX1 LWB స్టార్టింగ్ రూ.49 లక్షలతో తీసుకొస్తోంది. ఈ మోడల్ ఆటో ఎక్స్ పో 2025లో ఎంతగానో ఆకర్శించింది.