2025లో కార్లు కొనాలనే ప్లాన్లో ఉన్నోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..!

2025లో కార్లు కొనాలనే ప్లాన్లో ఉన్నోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..!
  • కార్ల ధరలు పెంచేందుకు రెడీ
  • రేట్ల పెంపుతో లగ్జరీ కార్ల ధరలు కనీసం రూ.2 లక్షల మేర పెరిగే ఛాన్స్‌‌‌‌‌‌‌‌
  • రామెటీరియల్స్ ధరలు పెరగడం, కంపెనీల లాభాలు పడిపోవడమే కారణం 

న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీలు రేట్లు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి  ధరలు పెంచుతామని మారుతి సుజుకీ, హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెర్సిడెజ్‌‌‌‌‌‌‌‌ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి టాప్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ప్రకటించాయి. ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. రామెటీరియల్స్ ధరలు పెరిగాయని, కార్యకలాపాల ఖర్చులు ఎక్కువయ్యాయనే కారణాలను  చూపుతున్నాయి. కార్ల కంపెనీలు ప్రతీ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ధరలు పెంచుతున్నాయని, దీంతో  రేట్లు పెరిగే ముందే కార్ల సేల్స్ పుంజుకుంటాయని భావిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కొత్త ఏడాదిలో బండ్లు తీసుకుందామనుకునే కస్టమర్లు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనుగోలు జరుపుతారని పేర్కొన్నాయి.  ఏడాది ప్రారంభంలో లేదా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో  బండ్ల రేట్లు పెరగడం చూస్తున్నామని, కొన్ని కంపెనీలైతే కొత్త మోడల్స్ లాంచ్ చేసే ముందు ధరలు పెంచుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రజత్ మహాజన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 

ధరలు పెంచడానికి చాలా కారణాలు ఉండొచ్చని, కానీ ముఖ్యమైన కారణం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొన్ని వెహికల్ కంపెనీల లాభాలు పడిపోవడమేనని అంచనా వేశారు.  ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో రేట్లు మారలేదని, వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రేట్లు మార్పు ఉంటుందని అన్నారు. ‘రామెటీరియల్స్ ధరలు పెరగడం,  కన్జూమర్లు  అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ ఫీచర్లకు  చెల్లించడానికి ఆసక్తి చూపకపోవడం,  నిల్వలు తగ్గించుకోవడానికి  పండుగ టైమ్‌‌‌‌‌‌‌‌లో డీలర్లు భారీగా డిస్కౌంట్లు ప్రకటించడంతో ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీల లాభాలు పడిపోయాయి’ అని రజత్ వివరించారు. 

ఈ కంపెనీల కార్ల రేట్లు పైకి

మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ  వచ్చే నెల ఒకటి నుంచి తమ  కార్ల రేట్లను 4 శాతం వరకు  పెంచుతామని ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్టోకే10 నుంచి యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌‌‌‌‌‌‌‌ను ఈ కంపెనీ అమ్ముతోంది.  హ్యుందాయ్ మోటార్స్‌‌‌‌‌‌‌‌  తమ కార్ల ధరలను రూ.25 వేల వరకు పెంచుతామని పేర్కొంది. ఈ కంపెనీ క్రెటా, వెర్నా వంటి పాపులర్ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలను అమ్ముతోంది. 

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీలు, కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ధరలను జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది.  అన్ని రకాల కార్ల రేట్లను 3 శాతం వరకు  పెంచుతామని జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించగా, హోండా కార్స్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచాలని చూస్తోంది. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్‌‌‌‌‌‌‌‌ బెంజ్ ఇండియా  జనవరి 1 నుంచి బండ్ల రేట్లను 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. 

 మెర్సిడెజ్‌‌‌‌‌‌‌‌ జీఎల్‌‌‌‌‌‌‌‌సీ రేట్లు  రూ.2 లక్షల మేర,  మేబ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ 680 లగ్జరీ లిమోజైన్ రేటు రూ.9 లక్షల మేర పెరుగుతుందని అంచనా. ఆడి, బీఎండబ్ల్యూ కూడా తమ కార్ల రేట్లను 3 శాతం మేర పెంచడానికి రెడీ అయ్యాయి. రామెటీరియల్స్ ధరలు పెరగడంతోనే  రేట్లను పెంచాల్సి వస్తోందని ఈ కార్ల తయారీ కంపెనీలు చెబుతున్నాయి.