OTT, సోషల్ మీడియాల్లో అశ్లీల, అసభ్య కంటెంట్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

OTT, సోషల్ మీడియాల్లో అశ్లీల, అసభ్య కంటెంట్ పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ , సోషల్ మీడియా లో అశ్లీల కంటెంట్ పెరిగిపోతుండంతో  సుప్రీం కోర్టు అసహనం  వ్యక్తం చేసింది.. ఎటువంటిసెన్సార్ కుండా ఫోర్న్ తో కూడిన కంటెంట్ ప్రసారం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేసింది.. .  అంతే కాకుండా వాటిని ప్రసారం చేస్తున్న నెట్ ఫ్లిక్స్​,  అమెజాన్ ,  ఫ్రైమ్​,  ఉల్లు, ఆల్ట్,  ఓటీటీలు, X, ఫేస్ బుక్​, ఇన్ స్ట్రాగ్రామ్ లాంటి సోషల్ మీడియ ప్లాట్ ఫామ్స్ కు నోటీస్ లు జారీ చేసింది..

కాగా, ఓటీటీ ప్లాట్​ఫామ్స్,  సోషల్ మీడియా లో అందుబాటులో ఉన్న లైంగిక, అసభ్యకరమైన కంటెంట్​ ను  నిషేధించాలని కోరుతూ దాఖలైన  పిటిషన్​ లపై  జస్టిస్ బీఆర్ గవాయ్ , అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఆన్​ లైన్​ లో అశ్లీల, లైంగిక, అసభ్యకర డేటాను నియంత్రించేందుకు జాతీయ కంటెంట్ నియంత్రణ అథారిటీ ని ఏర్పాటు చేసేలా వెంటనే కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు ధర్మాసానికి విజ్ఞప్తి చేశారు. కఠిన నియమాలు లేకపోవడం వల్లే ఆన్​ లైన్​ లో  జుగుప్సాకరమైన కంటెంట్ పుట్టుకొస్తుందని అన్నారు.

ఇక కొన్ని ఓటీటీ ప్లాట్​ ఫాంలు ‘పిల్లల అశ్లీలత’కు సంబంధించి సమానమైన కంటెంట్ ను  ప్రసారం చేస్తున్నారని వాదించారు. ఈ పరిణామంతో దేశంలోని యువత, పిల్లలు చెడిపోతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికైనా అశ్లీల కంటెంట్ సామాజిక విలువలకు భంగం వాటిల్లేలా చేస్తుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదలను విన్న ధర్మాసనం కేంద్రంతో పాటు పలు ఓటీటీలు, సోషల్ మీడియా హ్యాండిళ్లకు నోటీసులు జారీ చేసింది. అందులో నెట్ ఫ్లిక్స్​,  అమెజాన్ ,  ఫ్రైమ్​,  ఉల్లు, ఆల్ట్,  ఓటీటీలు, X, ఫేస్ బుక్​, ఇన్ స్ట్రాగ్రామ్ లాంటి సోషల్ మీడియ ప్లాట్ ఫామ్స్​  కూడా ఉన్నాయి. 14 రోజుల్లో  సమాధానం ఇవ్వాలని ఆ నోటీస్ లలో కోరింది..