24 గంటల్లోగా పొన్ముడి విషయం తేల్చాల్సిందే

24 గంటల్లోగా పొన్ముడి విషయం తేల్చాల్సిందే

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్​ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని ఫైర్ అయింది. శుక్రవారం సాయంత్రంలోపు డీఎంకే మాజీ మంత్రి పొన్ముడిని మంత్రిగా నియమించడంపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని డెడ్​లైన్ విధించింది. అక్రమాస్తుల కేసులో  పొన్ముడికి గతంలో జైలు శిక్ష పడటంతో ఎమ్మెల్యేగా ఆయన సభ్యత్వం రద్దయింది. ఈ కేసులో శిక్షను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారని తమిళనాడు స్పీకర్ ప్రకటించారు. సీఎం స్టాలిన్.. పొన్ముడి పేరును మంత్రిగా సిఫార్సు చేయగా.. గవర్నర్ నిరాకరించారు. స్టాలిన్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.