సైబర్​ సెక్యూరిటీపై సదస్సు

సైబర్​ సెక్యూరిటీపై సదస్సు

హైదరాబాద్, వెలుగు: సైబర్ మోసాలపై అవగాహన కలిగించడానికి ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 'సెక్యూరింగ్ ది ఫ్యూచర్: నావిగేటింగ్ ది ఇంటర్‌‌‌‌‌‌‌‌సెక్షన్ ఆఫ్ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ, ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' పేరుతో సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు నిపుణులు మోసాల బారి నుంచి తప్పించుకోవడానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబారాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ భయం, దురాశ వల్ల మనం మోసాల బారిన పడతామని చెప్పారు. ఈ సంవత్సరం సైబర్ క్రైమ్ మొత్తం నేరాలలో 30 శాతం ఉందని, అది రాబోయే కాలంలో 50 శాతానికి చేరుకోవచ్చని. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బెట్టింగ్, యాప్ రుణాల మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు.  యూపీఐ చెల్లింపులు, క్రిప్టో నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు.   అనంతరం  ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జీసీఎస్ శర్మ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చర్చించామని చెప్పారు. కార్యక్రమానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌లు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు వచ్చారని చెప్పారు.