మహా కుంభమేళాకు 73 దేశాల దౌత్యవేత్తలు

మహా కుంభమేళాకు 73 దేశాల దౌత్యవేత్తలు
  • వచ్చే నెల 1న అమెరికా సహా పలు దేశాల డిప్లోమాట్లు రానున్నారని ప్రభుత్వం వెల్లడి

మహాకుంభ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ దేశాలకు చెందిన అంబాసిడర్లతో పాటు 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌లోని త్రివేణి సంగమంలో స్నానమాచరించనున్నారు. అక్కడున్న ఆలయాలను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 1న ఆయా దేశాల డిప్లోమాట్లు మహా కుంభమేళాకు వస్తారని కుంభమేళా అధికారి విజయ్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌ ఆనంద్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

జపాన్‌‌‌‌‌‌‌‌, అమెరికా, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌, జర్మనీ, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌, కెమెరూన్‌‌‌‌‌‌‌‌, కెనడా, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌, స్వీడన్‌‌‌‌‌‌‌‌, పోలెండ్‌‌‌‌‌‌‌‌, బొలివియా తదితర దేశాల దౌత్యవేత్తలు రానున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి యూపీ సీఎస్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది. మరోవైపు, శనివారం మహాకుంభ్‌‌‌‌‌‌‌‌లోని సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2లో రెండు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక కారుకు మంటలు అంటుకున్నాయని, ఆపై పక్కన 
ఉన్న మరో కారుకు వ్యాపించాయని తెలిపారు.