Good Health : టీనేజ్ అమ్మాయిలు వీటిని కచ్చితంగా తినాలి.. లేకపోతే హార్మోన్లలో మార్పులు వస్తాయి..!

Good Health : టీనేజ్ అమ్మాయిలు వీటిని కచ్చితంగా తినాలి.. లేకపోతే హార్మోన్లలో మార్పులు వస్తాయి..!

టీనేజ్ అమ్మాయిల శరీరాల్లో శారీరకంగా, మానసికంగా మార్పులు మొదలవుతాయి. అందువల్ల ఈ వయసులో శరీరానికి తగిన పోషకాలు అందించాలి. టీనేజ్ అమ్మాయిల్లో 30% ఐరన్ లోపం, 20% విటమిన్ -ఏ తక్కువగా ఉంటున్నాయని సర్వేలు చెప్తున్నాయి. టీనేజ్లో ఈ పోషకాల లోపం వల్ల శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులు కూడా చోటుచేసుకుంటున్నాయి. అందువల్ల ఈ వయసు అమ్మాయిలు కాల్షియం, ఐరన్, అయోడిన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. 

అలాగే ఆడపిల్లలు ఎదిగి గర్భం దాల్చినప్పుడు, పిల్లలకు పాలిచ్చే సమయానికి ఎలాంటి బలహీనతలూ, ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలంటే పదేళ్లవయసు నుంచే మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి. ఈ దశలో పిల్లలకు పోషకాలున్న ఆహారం ఇస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు. డాక్టర్లు. అంతేకాదు ఏం ఏం తినాలో కూడా చెప్తున్నారు.

ఇవి తినాలి

చేపలు, గుడ్లు, పాలు, చీజ్, కోడి మాంసం, మటన్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేయడంతో పాటు కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.అందువల్ల వీటిని తరచూ తీసు కుంటూ ఉండాలి.అలాగే కాల్షియం అధికంగా ఉండే క్యాబేజీ, బ్రొకోలి, ఓక్రాలను కూడా డైట్ లో చేర్చాలి. వీటితో పాటు ఐరెన్ కోసం మాంసం, పాలకూర తీసుకోవాలి.

== వెలుగు లైఫ్